/rtv/media/media_files/2025/11/02/woman-protests-outside-lover-house-in-nalgonda-district-2025-11-02-16-58-09.jpg)
woman protests outside lover house in nalgonda District
నల్గొండ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియారాలు ధర్నాకు దిగింది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. నెల్లిబండలో రేణుకు అనే యువతి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదే ప్రేమగా మారింది.
అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. చివరికి గర్భం దాల్చిన రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత తనను పట్టించుకోకుండా అతడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని రేణుక తెలిపింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. దీంతో ఆ గ్రామ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని పంచాయితీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.
Follow Us