Malavika Mohanan: మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!

సినీ ఇండస్ట్రీలో మహిళలకు గౌరవం చూపుతున్నట్లు నటిస్తూ మంచివారిగా పేరు తెచ్చుకుంటున్న కొంతమంది నటులు నిజ జీవితంలో మాత్రం ఆలా ఉండరంటూ మాళవికా మోహన్‌ పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తులను గత ఐదేళ్లలో తాను స్వయంగా చూశానని షాకింగ్ కామెంట్స్ చేశారు.

New Update
Malavika Mohanan

Malavika Mohanan

Malavika Mohanan: బోల్డ్ పాత్రలు పోషించడంలో మాత్రమే కాదు, నిజం నిర్భయంగా చెప్పడంలోనూ తగ్గేదేలే అంటోంది మలయాళ భామ మాళవికా మోహన్‌. ఇండస్ట్రీలో కొంత మంది కెమెరా ముందు ఎంత మంచిగా కనిపించినా, కెమెరా వెనక అసలు నిజాలు వేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

Also Read:రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

రజనీకాంత్‌తో కలిసి నటించిన "పేట" మూవీతో తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ మలయాళీ భామ, విజయ్‌తో "మాస్టర్", ధనుష్‌తో "మారన్" వంటి చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసింది. తాజాగా విక్రమ్ హీరోగా, పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన "తంగలాన్" మూవీలో విభిన్నమైన  ప్రతినాయిక ఛాయలతో కూడిన పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఇదిలా ఉంటే, మలయాళంతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న మాళవికా మోహన్‌ తాజాగా తెలుగులోకి అడుగుపెట్టారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం "రాజాసాబ్" ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అంతేకాదు, తమిళ హీరో కార్తితో కలిసి "సర్దార్ 2"లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

అది అంతా నిజం కాదు..

ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాళవికా చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు మహిళల పట్ల గౌరవం చూపిస్తున్నట్టు నటిస్తూ మంచివాళ్లగా చలామణి అవుతున్నారు. కానీ, అది అంత నిజం కాదని ఆమె విమర్శించారు. గత ఐదేళ్లుగా అలాంటి వారిని ఎంతోమందిని స్వయంగా చూసినట్టు చెప్పారు.

అలాంటి వారు బహిరంగంగా మాట్లాడేటప్పుడు చాల బాగా మాట్లాడుతారని, కానీ కెమెరా ఆఫ్‌ అయిన తర్వాత వారి ప్రవర్తన ఎలా మారుతుందో తాను ప్రత్యక్షంగా చూశానని ఆమె స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో మగవారి హవా ఇంకా కొనసాగుతూనే ఉందని, అది ఎప్పుడు పూర్తిగా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని మాళవికా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ  వ్యాఖ్యలు నెట్టింట్లో ఫుల్ వైరల్‌ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు