/rtv/media/media_files/2025/07/18/maharashtra-crime-news-2025-07-18-14-38-57.jpg)
Maharashtra Crime News
ఆగ్రాలో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది నేటి సమాజంలో మానవ సంబంధాలు ఎంతగా దిగజారాయో ఈ వీడియో చూస్తే అర్థ అవుతుంది. ఓ మనిషి బాధలో ఉండగా.. అదే కుటుంబంలోని మిగిలిన సభ్యులు నిర్లక్ష్యంగా విహార యాత్ర చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన జూలై 18వ తేదీన ఆగ్రా తాజ్ మహల్ సమీపంలోని శిల్ప్‌గ్రామ్ పార్కింగ్‌లో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం తాజ్ మహల్ సందర్శన కోసం వెళ్లారు. వారు తమ కారును శిల్ప్‌గ్రామ్ పార్కింగ్‌లో ఉంచి.. 80 ఏళ్ల వృద్ధుడిని కారులోనే వదిలేసి వెళ్లారు. అంతేకాకుండా అతడిని సీటు బెల్ట్‌తో కట్టేసి కారు కిటికీలను పూర్తిగా మూసేశారు.
Also Read : బీజేపీ లో మాధవీలత చిచ్చు.. పార్టీ లైన్ దాటి...
కారులో వృద్ధుడిని బంధించిన కుటుంబం:
తీవ్ర వేడిలో గాలి రావడం కూడా కష్టంగా మారింది. వృద్ధుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్న అతడిని పార్కింగ్ సిబ్బంది గమనించారు. అతడి పరిస్థితి చూస్తే ఇది అత్యవసర పరిస్థితి అని గుర్తించారు. వృద్ధుడు స్పృహ తప్పే స్థితిలో ఉండటంతో సిబ్బంది వెంటనే స్పందించారు. ఆలస్యం చేయకుండా కారులోని కిటికీని పగలగొట్టి వృద్ధుడిని బయటికి తీశారు. ప్రాథమిక చికిత్స అందించి అతడిని రక్షించారు. అతడు కొంతసేపటికి తేరుకున్నాడు. పార్కింగ్ సిబ్బంది మానవత్వాన్ని చూపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధుడిని విచారించారు.
Also Read : బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!
Family on Agra trip ties 80-year-old in car, goes to see Taj Mahal
— Piyush Rai (@Benarasiyaa) July 18, 2025
In UP's Agra, an 80-year-old man was tied to the front seat of the car and left alone in a parked car near Taj Mahal while his family from Maharashtra went for sightseeing. The elderly man, amid the heat and… pic.twitter.com/O6KVRC4LfP
అప్పటికే అతని కుటుంబ సభ్యులు తాజ్ మహల్ సందర్శన ముగించుకుని తిరిగి వచ్చారు. వారిని పోలీసులు నిలదీశారు. వృద్ధుడిని ఎందుకు కారులో వదిలేసి వెళ్లారని ప్రశ్నించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ద్వారా వృద్ధులను కారులో ఒంటరిగా వదిలిపెట్టడం ఎంత ప్రమాదకరమో తెలిసింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల కారు లోపల వేడి అనూహ్యంగా పెరిగి ప్రాణాపాయం కలిగించవచ్చు. వృద్ధుడిని సకాలంలో రక్షించిన పార్కింగ్ సిబ్బందికి ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఆహారాలకు ఆ రోగి దూరంగా ఉంటే లైఫ్‌సెఫ్.. లేదంటే వారి ఆరోగ్యంపై..
ఇది కూడా చదవండి: దంపతుల్లో పెరుగుతున్న ఒబెసిటీ ప్రమాదం.. ICMR హెచ్చరికలు తెలుసుకోండి
(crime news | Latest News)