Bomb Threat: 'ఇండియాలోని ఆ ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం'

కేరళలోని తిరవనంతపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అలెర్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అన్ని టెర్మినల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి ఎలాంటి బాంబు లేదని గుర్తించారు.

New Update
Bomb threat at Thiruvananthapuram airport

Bomb threat at Thiruvananthapuram airport

కేరళలోని తిరవనంతపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టామని ఆదివారం కొందరు గుర్తుతెలియన వ్యక్తులు ఈమెయిల్స్‌ పంపారు. దీంతో అలెర్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అలాగే బాంబు స్క్వాడ్ టీమ్‌లు సైతం రంగంలోకి దిగాయి. అన్ని టెర్మినల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని హోటళ్లలో సోదాలు చేపట్టారు. చివరికి ఎలాంటి బాంబు లేదని గుర్తించారు.   

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

Bomb Threat At Thiruvananthapuram Airport

ఇదిలాఉండగా గత కొన్ని రోజులుగా కేరళలో ఈమెయిల్స్ బెదిరింపులు వస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్లు, కేరళ హైకోర్టు, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు లాంటివి టార్గెట్ చేసుకొని ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ పోలీసు సోదాల్లో మాత్రం ఎలాంటి బాంబులు దొరకడం లేదు. ఇది ఎవరు చేస్తున్నారో అనేది ఇంకా పోలీసులు గుర్తించలేదు.

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

ప్రస్తుతం ఈ బాంబు బెదరింపులపై విచారణ జరుగుతోంది. ప్రజలు ఎలాంటి భయం పెట్టుకోవద్దని, ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. వరుస బెదింపులు రావడంతో తిరువనంతపురం అంతా భారీగా భద్రత చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో పాఠశాలలు, హోటళ్లు, కంపెనీలలో కూడా బాంబులు పెట్టామంటూ బెదింపు ఈమెయిల్స్‌ వస్తున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పోలీసులు చర్యలు తీసుకున్నా కూడా ఈ బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. 

Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

telugu-news | rtv-news | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు