పాకిస్తాన్ వాడింది చైనా మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు.. సాక్ష్యాలు ఇవే!

భారత్‌పై పాకిస్తాన్ జరిపిన దాడులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ వాటిని పరిశీలించి అవి చైనా, టర్కీకి చెందినవిగా గుర్తించారు. చైనా PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి శిథిలాలను ఆర్మీ సాక్ష్యాలతో మీడియా ముందు పెట్టింది.

New Update
india pak war 123

అప్పు తెచ్చుకున్న ఆయుధాలతో పాకిస్తాన్ భారత్‌పైకి యుద్ధానికి కాలు దువ్వింది. భారత్‌పై పాకిస్తాన్ జరిపిన దాడులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ వాటిని పరిశీలించి అవి చైనా, టర్కీకి చెందినవిగా గుర్తించారు. చైనా PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి శిథిలాలను ఆర్మీ సాక్ష్యాలతో మీడియా ముందు పెట్టింది. టర్కికి చెందిన YIHA, సోంగర్ డ్రోన్లు కూడా ఇండియాపైకి దాడికి ప్రయత్నించాయని తేలింది. వాటికి సంబంధించిన శిథిలాలు ఫొటోలతో సహా మీడియాకు చూపించారు. 

న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో శిథిలాలను ఉంచారు. ఆపరేషన్ సిందూర్‌కు పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని 15 నగరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడుల్లో చైనా మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు వాడింది. త్రివిధ దళాధిపతులు సోమవారం మీడియా సమావేశం పెట్టారు. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ కీలక విజయాలను వివరించారు. 

(Turkish drones | china | india pak war)

Advertisment
Advertisment
తాజా కథనాలు