PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!

27ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ఈ విజయం ఘనత ప్రధాని మోదీకే చెందుతుండగా ఇంతకు మోదీ సక్సెస్ మంత్రం ఏమిటి? ఆయన నెక్ట్స్ టార్గెట్ ఏ రాష్ట్రాలు? మోదీ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదివేయండి. 

New Update
delhi modi

Delhi Elections 2025 PM Modi

PM Modi: రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి అందని ద్రాక్షగా మారిన ఢిల్లీ ఎట్టకేలకు చిక్కింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రంలో కమలం వికసిస్తూనే ఉంది. గత మూడుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ తుఫాను ముందు నిలవలేకపోయినా బీజేపీ ఈసారి ఆప్ కంచుకోటను బద్ధలు కొట్టింది. మోదీ విజయ మంత్రానికి చీపురు తుడిచిపెట్టుకుపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించడంతో కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించడం ప్రారంభించారు. దీంతో కేజ్రీవాల్ విజయం ప్రధాని మోదీకి ప్రత్యక్ష సవాలుగా మారింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఢిల్లీలో బీజేపీ పట్టు సాధించలేకపోయింది. గత ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న కమలం ఈ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ వికసించింది. 

బీజేపీకి చరిత్రలో మరువని ఓటమి..

మోదీ రెండోసారి దేశ ప్రధానమంత్రి అయ్యాక ఢిల్లీలో బీజేపీ గెలిచేందుకు మార్గం సులభం అవుతుందని భావించారు. కానీ 2015 లోక్ సభ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించినప్పటికీ బీజేపీ ఎందుకు అద్భుతం చేయలేకపోయిందనే బాధ అతనిలో మిగిలివుంది. 2020లోనూ బీజేపీ బలమైన వ్యూహంతో అడుగుపెట్టినా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ముందు నిలిచారు. దీంతో ప్రధాని మోదీ విజయ రథం మరోసారి ఢిల్లీలో ఆగింది. అరవింద్ కేజ్రీవాల్ ముందు బీజేపీ వ్యూహం పూర్తిగా విఫలమైంది. 70 సీట్లకుగాను 62 సీట్లలో ఆప్ భారీ విజయం సాధించింది. ఇది కేజ్రీవాల్ కు ఎంత పెద్ద విజయమో బీజేపీకి అంతే పెద్ద ఓటమి. ఈ విజయంతో కేజ్రీవాల్ ప్రధాని మోడీకి ప్రత్యక్ష సవాలు విసరడానికి సిద్ధమయ్యారు.

జాతీయ స్థాయిలో ఎదిగిన కేజ్రీవాల్..

గుజరాత్, గోవా, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయవంతమయ్యారు కేజ్రీవాల్. దీంతో ఆప్ స్థాయి నిరంతరం పెరుగుతూ వచ్చింది. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ముఖాముఖిగా తలపడటం ప్రారంభించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ముందు బీజేపీ ఎందుకు నిలవలేకపోతుందనే అంతర్గత ఆలోచనలు మొదలై గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది బీజేపీ అధిష్టానం. ఆ సమయంలోనే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసు బీజేపీకి పెద్ద ఆయుధంగా మారింది. అదే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ప్రధాన కారణంగా మారింది. దీంతో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటకలో గెలిచి తీరాలని భావిస్తోంది. 

మోదీ, బీజేపీ విజయ మంత్రం..

ఇదిలా ఉంటే.. బీజేపీ విజయం సాధించే వరకు ఆ రాష్ట్రంలో నిమగ్నమై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని ఉదాహరణ అనేక రాష్ట్రాల్లో కనిపించింది. ఓటమిని సమీక్షించుకుని నూతన ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొనడమే బీజేపీ విజయ మంత్రంగా మార్చుకుంది. అదేవిధంగా ఒడిశాలో  గెలిచింది. పశ్చిమ బెంగాల్‌లో మద్ధతు పెంచుకుంది. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తన ఉనికిని పెంచుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో తన ప్రయాణాన్ని సున్నా నుండి ప్రారంభించి నెమ్మదిగా ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ విజయాలన్నింటికీ క్రెడిట్ మొత్తం ప్రధానమంత్రి మోదీకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. అలాగే బీజేపీకి అతిపెద్ద ముఖంగా మారారు.

ఇది కూడా చదవండి: Delhi Results: 27 ఏళ్ల నిరీక్షణ.. ఢిల్లీలో బీజేపీ గెలవడానికి 8 ప్రధాన కారణాలివే!

దేశం అంతటా కాషాయ జెండా..

ఢిల్లీ ఎన్నికల విజయంతో ప్రధాని మోదీ దేశం అంతటా కాషాయ జెండాను ఎగురవేశారని చెప్పారు. ఢిల్లీలో అసంపూర్ణంగా మిగిలిపోయిన విజయ రహస్యాన్ని ప్రధాని మోదీ స్వయంగా గ్రహించినట్లు చెప్పారు. ప్రజలు కేజ్రీవాల్‌ను ఆలింగనం చేసుకుని బీజేపీ ఎందుకు తిరస్కరిస్తున్నారనే అంశాన్ని మోదీ క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్ద హృదయాలు కలిగిన ఢిల్లీ ప్రజలు తమకు నచ్చిన వ్యక్తులను ప్రాంతంతో సంబంధం లేకుండా గెలిపించుకుంటారన్నారు. 2015, 20లో చీపురుకు హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చిన వారంతా ఇప్పుడు అదే హృదయపూర్వకంగా బీజేపీ ఖజానాను నింపారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: BJP: కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. బీజేపీ చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిన సీఎంల లిస్ట్ ఇదే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు