/rtv/media/media_files/2025/04/10/rxEC4RJe8sBm8zDQ8yx0.jpg)
Bihar Man Kills Daughter
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తండ్రి ఆమెను హత్య చేయడం కలకలం రేపింది. మృతదేహన్ని బాత్‌రూమ్‌లో ఉంచి లాక్ చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాక్షి (25) అనే అమ్మాయి తన ప్రియుడితో కలిసి మార్చి 4న ఢిల్లీకి పారిపోయింది. మాజీ సైనికుడైన తండ్రి ముఖేష్ సింగ్ వారం తర్వాత తన కూతురుకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత సమస్తిపూర్‌కు ఆమెను రప్పించాడు.
Also Read: భారత్‌కు చేరుకున్న తహవ్వుర్ రాణా.. ఉరిశిక్ష విధిస్తారా ?
Bihar Man Kills Daughter
కానీ వేరే కులానికి చెందిన వ్యక్తితో కూతురు వెళ్లిపోవడంతో తండ్రి ముఖేష్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి ఏప్రిల్ 7న తన కూతురును హత్య చేశాడు. ఇంట్లో బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని ఉంచి లాక్ చేశాడు. అనంతరం ఆమె ప్రియుడిని కూడా హత్య చేసేందుకు వెళ్లాడు. కానీ అతడు గ్రామంలో లేకపోవడంతో వెనక్కి వచ్చేశాడు. అయితే కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లి భర్తను ముఖేష్‌ను అడిగింది. దీనికి అతడు సాక్షి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు.
Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్ బిలియనీర్ కేసులో భయంకర నిజాలు!
దీంతో కూతురు కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటికి వచ్చి పరిశీలించారు. లాక్‌చేసిన బాత్‌రూమ్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. డోర్ తీయగా లోపల మృతదేహం కనిపించడంతో షాక్ అయిపోయారు. దీంతో తండ్రి ముఖేష్‌ను అదుపులోకి తీసుకొని అడిగారు. వేరే కులం వ్యక్తితో పారిపోవడంతో తానే హత్య చేసినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. చివరికీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!
Also Read : ఏంటి భయ్యా ఇలా ఆడారు.. RCB ఇన్నింగ్స్ పూర్తి - DC ముందు టార్గెట్ ఇదే
murder | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu crime news