/rtv/media/media_files/2025/04/10/D90faqldTgwQevVhZiMz.jpg)
26/11 plotter Tahawwur Rana lands in Delhi
ముంబయి ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. యూఎస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగింది. అతడిని తిహాడ్ జైలుకు తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అతడిని అధికారులు బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో తీసుకెళ్తారని సమాచారం. తహవ్వుర్ రాణా రాకతో ఇప్పటికే ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్ బిలియనీర్ కేసులో భయంకర నిజాలు!
Also Read : ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!
తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు. దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 'రాణా లాంటి ఉగ్రవాదులకు భారతదేశం ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదు. కసబ్‌కు ఇచ్చినట్లుగా బిర్యానీ లేదా విశ్రాంతి ఇవ్వకూడదు. అటువంటి ఉగ్రవాదుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి. తద్వారా వారిని 2-3 నెలల్లో ఉరితీయవచ్చు' అని ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన మహ్మద్ తౌఫిక్ అలియాస్ 'ఛోటు చాయ్ వాలా' అన్నారు.
Justice For Tahawwur Rana
#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs
— ANI (@ANI) April 9, 2025
Also Read: ఇదేం మూర్ఖత్వం.. పిరియడ్స్ ఉన్న విద్యార్థికి క్లాస్ బయట పరీక్ష
Also Read : తరచుగా పార్కులకు వెళ్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి
''రాణాను చివరకు భారతదేశానికి తిరిగి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉగ్రవాదంపై భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం ఇది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశం, అమెరికా ప్రభుత్వాలకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చింది. రాణాను తీసుకువచ్చిన వెంటనే అతని నుంచి పాకిస్తాన్‌లో ఇప్పటికీ దాక్కున్న ఉగ్రవాదుల గురించి సమాచారం సేకరించాలి. రాణాకు వీలైనంత త్వరగా మరణశిక్ష విధించాలి' అని దాడి బాధితురాలు దేవిక నట్వర్‌లాల్ రోతవాన్ అన్నారు. అయితే తహవ్వూర్ రాణాకు ఉరిశిక్ష విధిస్తారా ? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | delhi