/rtv/media/media_files/2025/04/10/EFFcpfj9gsei7OyPA0Tw.jpg)
RCB VS DC MATCH
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ తాజాగా పూర్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఢిల్లీ జట్టు 164 పరుగులు సాధించాల్సి ఉంది.
Also Read: డిప్యూటీ ప్రధానిగా నితీశ్ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
ఎవరెవరు ఎంత స్కోర్ చేశారంటే?
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. మొదట ఇన్నింగ్‌లో RCB ఘోరంగా విఫలమైంది. మొదట మంచి ఫామ్ కనబరిచినా.. మధ్యలో వరుస వికెట్లు పడటంతో తక్కువ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లుగా దిగిన సాల్ట్, విరాట్ కోహ్లీ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. కానీ ఆ దూకుడు ఎక్కువ సమయం నిలవలేదు.
కేవలం 3 ఓవర్లలో 0 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఇవాళ భారీ స్కోర్ నమోదు చేస్తుందని అంతా భావించారు. కానీ ఆ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. వరుసగా మూడు వికెట్లు ధన్ ధనా పడిపోయాయి. సాల్ట్, పడిక్కల్, కోహ్లీ పెవిలియన్‌కు చేరారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లీ, సాల్ట్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఆ దూకుడు ఎక్కువ సమయం నిలవలేకపోయింది.
Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి
సాల్ట్ ఫ్రంట్‌కెళ్లి ఆడటంతో స్టంప్‌కు దొరికిపోయాడు. దీంతో 17 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. కానీ అంతలోనే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. విరాట్ 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అనంతరం క్రీజ్‌లో ఉన్న పడిక్కల్ సైతం ఎక్కువ సమయం నిలవలేకపోయాడు. 8 బాల్స్ ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో 9 ఓవర్లలో ఆర్సీబీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు సాధించింది.
Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!
ఆ తర్వాత కెప్టెన్ పాటిదార్ 23 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. లివింగ్‌స్టన్ 6 బంతుల్లో 4 పరుగులు, వికెట్ కీపర్ శర్మ 11 బంతుల్లో 3 పరుగులు, కృనాల్ పాండ్యా 18 బంతుల్లో 18 పరుగులు, డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 4 బంతుల్లో 1 పరుగు సాధించారు. వీరిలో ఓపెనర్ సాల్ట్, డేవిడ్ తప్పించి మిగతా బ్యాటర్లెవరూ ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. దీంతో ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు సాధించి. మరి సెకండ్ ఇన్నింగ్‌లో ఢిల్లీ జట్టు ఎలాంటి పెర్ఫార్మెన్స్ అందిస్తుందో చూడాలి.
(rcb | dc | IPL 2025 | latest-telugu-news | telugu-news)