/rtv/media/media_files/2025/04/18/dcbBTgTNOXY4owhiN1BK.jpg)
Bigg Boss
Bigg Boss Cancelled: వివిధ భాషల్లో ప్రచారమవుతోన్న బిగ్ బాస్ రియాలిటీ షో వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే అది తెలుగులో కాదు. హిందీ షో మాత్రమే. చాలా ఏళ్లుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. కాగా, తాజాగా 2025లో ఈ షో జరిగే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాదికి విరామం ఇచ్చి వచ్చే సంవత్సరం నుంచి కొనసాగించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది బిగ్ బాస్ అభిమానులు నిరాశపడుతున్నారు.
Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
అయితే బిగ్ బాస్ వాయిదాకు కారణమేంటని ఆరాతీసిన అభిమానులకు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయట. బనిజయ్ ఆసియా, ఎండేమోల్ సంస్థలతో కలర్స్ ఛానల్ కు మధ్యనున్న విబేధాలే బిగ్ బాస్ వాయిదా పడడానికి కారణమని సమాచారం. దీంతో పాటు మరో షో ఖత్రోం కీ ఖిలాడీ కార్యక్రమం సైతం రద్దయ్యే అవకాశం ఉంది. వీరిద్దరి యజమాన్యాల మధ్య రెండు నెలల క్రితం వివాదం చెలరేగగా, తాజాగా ఈ రియాల్టీ షోల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై కలర్స్ మీడియా, బనిజయ్ ఆసియా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ కార్యక్రమాలు రద్దు కావని, కేవలం వాయిదా పడతాయని మరికొందరు అంటున్నారు. కలర్స్ ఛానెల్ కొత్త నిర్మాతల కోసం వెతుకుతోందని తెలుస్తోంది. ఒకవేళ ఈ సీజన్ లో నిర్మాతలు దొరికితే కంటిన్యూ చేస్తారా లేక అలాగే వాయిదా వేస్తారా అనే అంశం లో క్లారిటీ లేదు.
Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!
భారత టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన షోగా బిగ్ బాస్ నిలిచింది. ఈ షో వల్ల అనేక మంది కొత్తనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. పలువురు నటులు కెరీర్లో రాణించారు. 2006లో ప్రారంభమైన మొదటి సీజన్‌కు అర్షద్ వార్సీ హోస్ట్‌గా వ్యవహరించారు. అనంతరం రెండో సీజన్‌లో శిల్పాశెట్టి, మూడో సీజన్‌లో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 4 నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉంటున్నారు. దీని ఆధారంగా అనేక భాషల్లోనూ బిగ్ బాస్ షోలను నిర్వహిస్తున్నారు. కాగా, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం 2025 ఆగస్టులో ప్రారంభమయ్యేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు..
Also read: Maoist: ఛత్తీస్‌గడ్‌లో 22 మంది మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్