Al-Falah University: అల్-ఫలాహ్ యూనివర్సిటీకి బిగ్ షాక్..NAAC ఏం చేసిందంటే?

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనతో అల్-ఫలాహ్ యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. తాజాగా ఆ యూనివర్సిటీకి న్యాక్ (NAAC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించడంపై NAAC ఈ నోటీసులు ఇచ్చింది.

New Update
FotoJet (84)

Big shock for Al-Falah University..

Al Falah University: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటన(Delhi Blast Incident) తో అల్‌-ఫలా యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. అక్కడ పనిచేస్తోన్న కొందరు వైద్యులు ఈ ఘటనలో అనుమానితులుగా ఉండటంతో యూనివర్సిటీ వార్తల్లో చేరింది. ఇపుడు దర్యాప్తు అంతా యూనివర్సిటీ చుట్టే తిరుగుతుంది. ఈ విషయం ఇలా ఉండగానే తాజాగా ఆ విశ్వవిద్యాలయానికి న్యాక్ (National Assessment and Accreditation Council (NAAC)) షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినట్లు NAAC గుర్తించింది. దీనికి గానూ ఈ నోటీసులు ఇచ్చింది.

Also Read :  SLBC టన్నెల్ నిర్మాణ సంస్థ ఎండీ మనోజ్ గౌర్ అరెస్టు.. కారణం అదేనా?

Big Shock For Al-Falah University

‘‘అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ.. న్యాక్(NAAC Accredited Campus) గుర్తింపు పొందకుండానే గుర్తింపుఉన్నట్లు ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తోంది. యూనివర్సీటీ  న్యాక్ గుర్తింపు పొందకుండా, అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా తన వెబ్‌సైట్‌లో మాత్రం కళాశాలకు గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించడం వివాదస్పదంగా మారింది. "ఇది పూర్తిగా తప్పు. ప్రజలను, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుంది’’ అని NAAC తన నోటీసుల్లో పేర్కొంది. 

హరియాణా (Haryana)లోని ఫరీదాబాద్‌ జిల్లా ధౌజ్‌ గ్రామంలో ఉన్న అల్‌-ఫలాహ్‌ యూనివర్సీటీ 76 ఎకరాల్లో విస్తరించి ఉంది. హరియాణా ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద దీన్ని ఏర్పాటుచేశారు. 1997లో మొదట ఇంజినీరింగ్‌ కాలేజీగా ప్రారంభమంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌) నుంచి ‘ఏ’ గ్రేడ్‌ అందుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్‌-ఫలా మెడికల్‌ కాలేజీని కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అలాగే తమది గుర్తింపుపొందిన విద్యాసంస్థ అని యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటన కూడా పేర్కొంది. ఈ పరిణామాల వేళ.. న్యాక్ నోటీసులు పంపడం గమనార్హం.

Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర

Advertisment
తాజా కథనాలు