/rtv/media/media_files/2025/11/13/fotojet-82-2025-11-13-15-47-19.jpg)
SLBC Tunnel Construction Company MD Manoj Gaur arrested
భారత రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అరెస్టు చేసింది.ఈ సంస్థ రాష్ట్రంలో శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ (SLBC) నిర్మాణ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. గృహ కొనుగోలుదారులను మోసం చేసి వారి డబ్బును మళ్లించిన కేసు(money-landering) లో అరెస్ట్ చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 కింద ఈ కేసు నమోదైందని సమాచారం. గృహ నిర్మాణాల కోసం ప్రజల వద్ద తీసుకున్న రూ.12,000 కోట్ల నిధులు దుర్వినియోగం చేసినందుకు, జేపీ ఇన్ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్ సంస్థ ఎండీ మనోజ్ గౌర్ ను అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.
ఈ ఏడాది మేలో జేపీ ఇన్ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్‌తో పాటు వాటి అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయా సంస్థలకు చెందిన ఢిల్లీ, ముంబయి, ఘజియాబాద్‌ల్లోని 15 ప్రదేశాలలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో రూ.1.7 కోట్ల నగదు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ డేటా, ప్రమోటర్లు, వారి కుటుంబసభ్యులు, గ్రూప్ కంపెనీల పేర్లపై నమోదైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (Jaypee Infratech Ltd)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలు చేపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. మనోజ్ గౌర్ నేతృత్వంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్, దాని పెరెంట్ కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL) దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన భారీ ఆర్థిక మోసం, గృహ కొనుగోలుదారుల నిధుల దుర్వినియోగంలో పాల్గొన్నట్లు తేలింది.
Also Read : ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. ఆత్మహుతికి పాల్పడింది ఉమర్‌నే..
SLBC Tunnel Construction Company MD Arrested
ఈ విషయమై మే 2025లో, ED మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఒక విస్తృత దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో ఢిల్లీ, నోయిడా, ముంబై, లక్నో తదితర నగరాల్లోని 15 ప్రదేశాలపై ఏకకాలంలో దాడులు జరిగాయి. అధికారుల ప్రకారం.. ఈ దాడుల్లో రూ. 1.70 కోట్ల నగదు, అనేక కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంక్ రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది.ఈ దాడులు జేపీ ఇన్‌ఫ్రాటెక్, జైప్రకాష్ అసోసియేట్స్ వాటి అనుబంధ సంస్థలపై ఉన్న మనీ లాండరింగ్, ఆస్తుల మళ్లింపు, అక్రమ ఫండ్ల వినియోగంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగమని చెప్పవచ్చు.
ED ఆరోపణల ప్రకారం.. జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ గృహ ప్రాజెక్టుల కోసం హోమ్ బయ్యర్ల నుండి సేకరించిన నిధులను అక్రమంగా ఇతర ప్రాజెక్టులకు మళ్లించింది. దీని ఫలితంగా, వేలాది మంది గృహ కొనుగోలుదారులు ఇళ్ల కోసం చెల్లించిన డబ్బును తిరిగి పొందలేక ఇబ్బందుల్లో పడ్డారు. 2017లోనే జేపీ ఇన్‌ఫ్రాటెక్‌పై పలువురు గృహ కొనుగోలుదారులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారు. ఈ కంపెనీ తమ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించిందని, సమయానికి ఫ్లాట్లు అందించలేదని ఆరోపించారు. ఈ కేసులు తరువాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని ఇన్‌సాల్వెన్సీ ప్రాసెస్ (Insolvency and Bankruptcy Code) కింద దర్యాప్తు దశకు చేరాయి. రూ. 12 వేల కోట్ల మోసంలో అనేక అనుబంధ కంపెనీలు పాల్గొన్నాయి. పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. అనుమానాస్పద లావాదేవీలు అనేక బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయి. దర్యాప్తులో డబ్బు మార్పిడి ట్రయల్ (money trail)ను ED గుర్తించింది.
జేపీ ఇన్‌ఫ్రాటెక్ 2000ల ప్రారంభంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖంగా ఎదిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతో కంపెనీ మంచి పేరు గాంచింది. అయితే, 2015 తర్వాత డెబ్ట్ బరువుతో, ప్రాజెక్టుల ఆలస్యాలతో కంపెనీ సమస్యల్లో పడింది. 2017లో ఇన్‌సాల్వెన్సీ ప్రాసెస్ కింద కేసులు దాఖలైన తర్వాత అనేక పునరుద్ధరణ ప్రయత్నాలు జరిగాయి. అయితే అవేమి విజయవంతం కాలేదు. ఇప్పుడు ED అరెస్ట్‌తో కేసు కొత్త దిశలోకి వెళ్లింది. అధికారులు మనోజ్ గౌర్‌ను విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని ఆర్థిక లావాదేవీలు, నిధుల మార్గం, ఇతర ప్రమోటర్ల పాత్ర బయటపడే అవకాశముంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ అరెస్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి స్పష్టమైన హెచ్చరిక అని చెప్పవచ్చు.పెట్టుబడిదారుల డబ్బు దుర్వినియోగం పట్ల కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించినట్లయింది.
Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
Follow Us