BIG BREAKING: ఢిల్లీలో మరోసారి భారీ శబ్ధంతో పేలుడు!
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు కారణం జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) అని దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్ట్ తో దీనివెనుక మహిళా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించడానికి కారణమైంది. అసలేం జరిగిందో అర్థం చేసుకునేలోపే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పొయారు. కాగా ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్‌కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ కారు బ్లాస్ట్ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ కారు బ్లాస్ట్ ఆత్మాహుతి దాడి అని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన పేలుళ్లు ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపారు.
డిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో అనుమానిత ఆత్మాహుతి దాడిదారుడు ఉమర్ తల్లి, ఇద్దరు సోదరులను పుల్వామాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. DNA పరీక్షలు జరుగుతున్నాయి. ఉమర్ ఉగ్రవాద మాడ్యూల్‌కు చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.