/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Worlds-most-expensive-divorce-in-600000-crores-jpg.webp)
Bengaluru software couple divorce case Court sensational verdict
Viral News: బెంగళూరుకు చెందిన ఓ విడాకుల కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్యతో విభేదాల కారణంగా విడాకులకావాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే భరణం కోసం భార్య భారీగా డిమాండ్ చేసింది. అయితే ఈ వ్యవహారం నడుస్తుండగానే ఆమె రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. భార్య బాగోతాన్ని బయటపెట్టేందుకు గూఢచారిగా మారిన భర్త న్యాయస్థానం సహాయంతో ఆమెకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
వరకట్న వేధింపులు, అబార్షన్..
ఈ మేరకు బెంగళూరు దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకాకు చెందిన ఇద్దరు దంపతులు కేఆర్ పురంలో ఉంటూ సాఫ్ట్ వేరు ఉద్యోగం చేస్తున్నారు. అయితే కొంకాలానికి వీరిమధ్య గొడవలు రావడంతో.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భర్తపై ఆ యువతి గృహహింస, వరకట్న వేధింపుల ఆరోపణలతోపాటు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. భరణం కింద రూ.3 కోట్లు, నెలవారీ మెయింటెనెన్స్ కింద రూ.60 వేలు ఇవ్వాలని కోరింది.
Also Read: అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం
అయితే భార్య ఆరోపణలు ఖండించిన భర్త.. క్రూరత్వం, మానసిక వేధింపులు, నమ్మకద్రోహం వంటివి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ఐ-ఏ) కింద 2021లో విడాకులు కోరాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఆ యువతి రహస్యంగా రెండో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు ఈ విషయం గమనించిన భర్త.. మారు పేరుతో ఒక ఎంప్లాయర్ గా ఆమెను ఆన్ లైన్ వేదికగా పరిచయం చేసుకున్నాడు. నకిలీ జాబ్ ఆఫర్ ఇచ్చి ఆమె నుంచి సమాచారం మొత్తం లాగేసుకున్నాడు. మెయిల్ లో రాతపూర్వకంగా రాసి పెట్టడంతో ఆ రుజువులన్నీ కోర్టుకు అందించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించి న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. భరణం, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, బంగారు ఆభరణాలను మాత్రమే తిరిగి ఇవ్వాలని భర్తను ఆదేశించింది. చివరగా లిటిగేషన్ ఖర్చుల కింద 3 లక్షలు అతనికే ఇవ్వాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.