Divya : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహుబలి నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చెన్నైలో సీఎం స్టాలిన్ సమక్షంలో ఆమె అధికార DMKలో చేరారు. త్వరలో ఆమెకు సీఎం కీలక  బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం నడుస్తోంది.  

New Update
divya satyaraj

divya satyaraj Photograph: (divya satyaraj)

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహుబలి నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.  చెన్నైలో సీఎం ఎంకే  స్టాలిన్ సమక్షంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)లో 2025 జనవరి 19 వ తేదీన అధికారికంగా  చేరారు. ఈ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, మంత్రులు పీకే శేఖర్‌ బాబు, కేఎన్‌ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.  

పార్టీలో చేరిన అనంతరం దివ్య సత్యరాజ్ మీడియాతో మాట్లాడుతూ..   డీఎంకే మహిళలను గౌరవించే పార్టీ అని, అందుకే తాను ఈ పార్టీ కోసం పనిచేయాలని అనుకున్నాని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి ఉచిత అల్పాహార పథకం ద్వారా పౌష్టికాహారానికి డీఎంకే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. డీఎంకే అన్ని మతాలను సమానంగా చూస్తుందని దివ్య వెల్లడించారు.  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్,  ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తనపై  నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  డీఎంకే మార్గదర్శకత్వంలో ప్రజల కోసం పనిచేయడానికి సన్నద్ధమని ఆమె తెలిపారు.

కీలక  బాధ్యతలు 

కాగా పోషకాహార నిపుణురాలైన దివ్య 2019లోనే  డీఎంకేలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఆమె సీఎంతో భేటీ కావడంతో వార్తలు ఊపందుకున్నాయి. అయితే   అది మర్యాదపూర్వక భేటీయేనని, ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అప్పట్లో ఆమె వివరణ ఇచ్చారు. తాజాగా ఆమె పార్టీలో చేరారు.   దివ్య సత్యరాజ్ చేరికతో డీఎంకేలో కొత్త ఉత్సాహం నెలకొంది. త్వరలో ఆమెకు సీఎం కీలక  బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం నడుస్తోంది.  

Also Read  :   కేసీఆర్, హరీశ్ లకు బిగ్ షాక్.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్‌ కీలక నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు