Karnataka : గ్యాంగ్‌రేప్‌ నిందితులకు బెయిల్‌.. బయటకు వచ్చాక రోడ్లపై హల్ చల్ -VIDEO

ఓ గ్యాంగ్ రేప్ కేసులో జైలు శిక్షను అనుభవించి బెయిల్ పై రిలీజైన నిందితులు రోడ్ షో చేసి రచ్చ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

New Update
gang-rape-accused

ఓ గ్యాంగ్ రేప్ కేసులో జైలు శిక్షను అనుభవించి బెయిల్ పై రిలీజైన నిందితులు రోడ్ షో చేసి రచ్చ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  హవేరిలోని అక్కి అలూర్‌ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుల స్నేహితులే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. వైరల్ గా మారిన ఈ వీడియోలో నిందితులు కార్లు, బైక్‌ల మీద స్పీడ్‌గా వెళ్తూ.. బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.  ఈ వీడియోలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.  దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిందితులు - అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మందక్కి, సమివుల్లా లాలనవర్, మహ్మద్ సాదిక్ అగసిమాని, షోయిబ్ ముల్లా, తౌసిఫ్ చోటి మరియు రియాజ్ సావికేరిగా గుర్తించారు.  

Also Read  :  కుంకుమపువ్వు టీ తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?

Also Read :  బెంగళూరులో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్

Also Read :  ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు

గదిలోకి దౌర్జన్యంగా చొరబడి

2024 తనపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టుగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనగల్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో తన స్నేహితుడితో ఉండగా.. నిందితులు తమ గదిలోకి దౌర్జన్యంగా చొరబడినట్లుగా ఆమె వెల్లడించారు.  అనంతరం తనను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లుగా మహిళ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు ప్రధాన నిందితులతో సహా మొత్తం 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితురాలు ముందుగా నిందితులను గుర్తించినప్పటికీ.. కోర్టు విచారణ సమయంలో వారిని గుర్తుపట్టడటంలో ఇబ్బందిపడింది. ఈ క్రమంలో నిందితుల్లోని 12 మంది పది నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రధాన నిందితులైన ఏడుగురికి మాత్రం ఇటీవలే బెయిల్‌ లభించింది.  

Also Read :  కసాయి తల్లి.. నవ శిశువుని బావిలో పడేసి.. తర్వాత ఏం చేసిందంటే?

karnataka | Viral Video | gang rape accused | telugu-news 

Advertisment
తాజా కథనాలు