Raksha Bandhan: పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు

ఓ మహిళ తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె సోదరుడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు. అతనికి రాఖీ కట్టేందుకు ఎదురుచూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

New Update
Balaghat Woman Waits 14 Years To Tie Rakhi To Brother In Pakistan Jail

Balaghat Woman Waits 14 Years To Tie Rakhi To Brother In Pakistan Jail

దేశవ్యాప్తంగా ప్రజలు రక్షాబంధన్ వేడుక చేసుకుంటున్నారు. తమ అనురాగ బంధానికి గుర్తుగా అక్కాచెల్లెల్లు వారి సోదరులకు రాఖీలు కడుతున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ ప్రేమ, అప్యాయతలు పంచుకుంటున్నారు. అయితే సంఘమిత్ర అనే మహిళ మాత్రం తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె సోదరుడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు. దీంతో తన సోదరుడు వచ్చేవరకు ఎవరికీ రాఖీ కట్టనని, అతని కోసమే ఎదురుచూస్తుంటానని ఆమె చెబుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also read: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని ఆస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!

Balaghat Woman Waits 14 Years To Tie Rakhi

ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన ప్రసన్నజిత్ రంగారీ అనే విద్యార్థి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి కనిపించకుండాపోయాడు. అతని ఆచూకి కోసం కుటుంబ సభ్యులు ఎంతగానో గాలించారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ప్రసన్నజిత్ జాడ కనిపించలేదు. అతడు ఏదైనా ప్రమాదంలో మృతి చెంది ఉంటాడని అనుకున్నారు. కానీ 2021లో పాకిస్థాన్ చెర నుంచి ఓ భారత ఖైదీ విడుదలయ్యాడు. అతడు ప్రసన్నజిత్ రంగారీ కుటుంబాన్ని కలిశాడు. ప్రసన్నజిత్ చనిపోలేదని.. 2019 నుంచి పాకిస్థాన్‌ జైల్లో ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుతం లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ జైల్లో ఉంటున్నాడని.. అతని పేరు కూడా మార్చేశారని తెలిపాడు.  

Also Read: ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. బెదిరింపులకు భయపడదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్

అప్పట్లో ప్రసన్నజిత్‌ రంగారీ పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించాడని.. అతడిని అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు చెప్పాడు. అప్పటినుంచి ప్రసన్నజిత్‌ను జైలు నుంచి విడిపించాలని అతడి సోదరి సంఘమిత్ర విదేశాంగ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతోంది. కొంతకాలం క్రితమే తమ తండ్రి మృతి చెందాడని.. తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడి జరగడం వల్ల పోస్టల్ సేవలు నిలిచిపోయానని.. దీనివల్ల తాను రాసిన లేఖను సోదరుడికి పంపించలేకపోతున్నానని వాపోయింది. 

Also Read: జనహిత పాదయాత్ర నాది..మీనాక్షిది కాదు..పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని కోరుతోంది. తన సోదరుడిని పాకిస్థాన్‌ జైలు నుంచి విడిపించాలని విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు రక్షాబంధన్ సందర్భంగా తన సోదరుడికి రాఖీని పంపినట్లు చెప్పింది. తాను ప్రేమతో పంపిన ఆ రాఖీని పాక్ అధికారులు లాహోర్‌లోని జైల్లో ఉన్న తన సోదరుడికి అందించాలని కోరుతోంది. 

Also Read: ఇండియన్లే భారతీయతను మర్చిపోతున్నారా..ఢిల్లీ రెస్టారెంట్ లో ఓ జంటకు అవమానం

ఇదిలాఉండగా.. ప్రస్తుతం పాకిస్థాన్‌ జైల్లో పలువురు భారతీయ పౌరులు మగ్గిపోతున్నారు. సరిహద్దుల్లో అక్రమంగా పాక్‌ భూభాగంలోకి  ప్రవేశించడం, సముద్రంలో పాక్‌ జలాల్లోకి అనుకోకుండా వెళ్లిన మత్స్యకారులను అక్కడి అధికారులు అరెస్టు చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్లు కొన్ని నెలలు, ఏళ్ల పాటు పాక్‌ జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు కొంతమంది విడుదలైనప్పటికీ ఇంకా చాలామంది అక్కడే చిక్కుకుని శిక్ష అనుభవిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు