Bomma Mahesh Kumar Goud : జనహిత పాదయాత్ర నాది..మీనాక్షిది కాదు..పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర నాది..కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.

New Update
Mahesh Kumar Goud

Bomma Mahesh Kumar Goud

రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర నాది..కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. మొదట బస్సు యాత్ర చేయాలని అనుకున్నామని.. ఆ తర్వాత పాదయాత్ర గా మార్చామని ఆయన అన్నారు. 23 తర్వాత జనహిత పాదయాత్ర మళ్లీ మొదలు పెడుతామని తెలిపారు.నా పాదయాత్ర లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా మధ్య లో జాయిన్ అవుతారని వివరించారు. భారత్ జోడో యాత్ర తలపించేలా పాదయాత్ర జరిగిందన్నారు.కొత్త పెన్షన్ లు ఇవ్వాలని ఎక్కువ విజ్ణప్తులు వస్తున్నాయని తెలిపారు.

ఇది కూడా చూడండి:KTR vs Bandi Sanjay :  బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్‌.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్

Janahita Padayatra Is Mine - PCC Chief Mahesh Kumar Goud

42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయం లో మా కమిట్మెంట్ ను శంకిచాల్సిన అవసరం లేదని మహేష్‌ గౌడ్‌(Bomma Mahesh Kumar Goud) తెలిపారు. గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లలో ముస్లిం లకు ఇచ్చిన రిజర్వేషన్ల పై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జంతర్ మంతర్ ధర్నా కు షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ 12 గంటలకు రావాల్సి ఉండగా... రాంచి పర్యటన లేటవ్వడం తో రాలేకపోయారని వివరించారు. బీసీ రిజర్వేషన్ల పై ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చారన్నారు. బీసీ రిజర్వేషన్లు విషయంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఈటెల, అరవింద్ ల మౌనం బీసీ లకు నష్టమన్నారు.

 తెలంగాణ లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న మహేష్‌ గౌడ్‌ అది కూడా కాంగ్రెస్ లోనే అవుతారన్నారు. సీఎం కు  నాకు మధ్య విభేదాలు ఉన్నట్లు కొందరు విష ప్రచారం చేస్తున్నారు.నాకు ,సీఎం మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టే... రిజర్వేషన్ల పై ఇంత వరకు పోరాడమని వివరించారు. పదేళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి అనడం లో తప్పు లేదు..మా ప్రభుత్వం పై కాన్ఫిడెన్స్ పెంచడం కోసం సీఎం అలా మాట్లాడడం మంచిదేనని సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి , అనిరుధ్ రెడ్డి అంశంపై క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా మారాడు... పీసీసీ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు.. సీఎం రేవంత్ రెడ్డి వేరని తెలిపారు.అసెంబ్లీ లో బీసీ బిల్లు కు మద్దతు ఇచ్చిన బీజేపీ, కేంద్రం లో బిల్లు పాస్ చేయనివ్వడం లేదని ఆరోపించారు.

పదవుల భర్తీ పై కసరత్తు పూర్తయింది... త్వరలోనే పోస్ట్ లు భర్తీ చేస్తామన్నారు. కిషన్ రెడ్డి భయం తో బండి సంజయ్, ఈటెల మాట్లాడడం లేదన్నారు.నాలుగు గైదు రోజుల్లో పీఏసీ సమావేశం ఉంటుంది. పీఏసీ లో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. స్వయం ప్రతిపత్తిగల సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్విర్యం చేస్తుందన్నారు.ఈడీ, సీబీఐ కేసులు అన్ని ప్రతిపక్షాలపైనే పెడుతున్నారు.ఓక వ్యక్తి కి నాలుగు రాష్ర్రాలలో ఓటు హక్కు ఉంది. SIR పేరిట పెద్ద మోసం జరుగుతుంది.. ప్రతిపక్ష పార్టీ ల సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని మహేష్‌ గౌడ్‌ ఆరోపించారు.

బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఒప్పందం లో భాగంగానే బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష్య పదవి నుంచి తొలగించారు. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ను ఓక బీసీ నుంచి , రాష్ట్ర అధ్యక్ష పదవి ని మరో బీసీ నుంచి కిషన్ రెడ్డి లాక్కున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక పై సర్వే జరుగుతుందన్న పీసీసీ అధ్యక్షుడు నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేసారన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మా గెలుపు నల్లేరు మీద నడకేనని మహేష్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

Revanth Reddy | Meenakshi Natarajan | latest-telugu-news | telugu-news | latest telangana news

Advertisment
తాజా కథనాలు