/rtv/media/media_files/2025/04/15/G1IptKCnCwkPIV0vIOL9.jpg)
ayodhya ram mandir
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు వచ్చింది. రామమందిరాన్ని పేల్చేస్తామంటూ ఏకంగా డిప్యూటీ కలెక్టర్లకు ఈమెయిల్స్ రావడం కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదు అయింది. ఈ ఈమెయిల్స్ తమిళనాడు నుండి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బాంబు బెదిరింపుపై అధికారుల దర్యాప్తు చేపట్టారు. అయోధ్య రామమందిరంతో పాటుగా అలీఘర్ కలెక్టరేట్‌ను బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్ వద్ద పోలీసు దళం డాగ్ స్క్వాడ్, ఇతర పరికరాల సహాయంతో దర్యాప్తు చేస్తోంది. అలీఘర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. ఆ ప్రాంగణంలోని అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయి.
Also Read : టాస్ గెలిచిన పంజాబ్..కోల్‌కతా జట్టులో ఒక మార్పు
Also Read : త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
రామ జన్మభూమి ట్రస్ట్‌కి బెదిరింపు మెయిల్స్
గత సోమవారం రాత్రి, రామ జన్మభూమి ట్రస్ట్‌కి బెదిరింపు మెయిల్స్ రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అయోధ్యతో పాటు, బారాబంకి, ఇతర పొరుగు జిల్లాలను కూడా హై అలర్ట్‌లో ఉంచారు. అయోధ్యలోని రామాలయం 135.5 మిలియన్ల దేశీయ సందర్శకులను ఆకర్షించింది. 2024లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా సందర్శించే ప్రదేశంగా తాజ్ మహల్‌ను అయోధ్య రామమందిరం అధిగమించింది. పర్యాటకులు, భక్తుల రద్దీ పెరుగుతున్నందున, స్థానిక పోలీసులు నగరం చుట్టూ గస్తీని పెంచారు.
Also Read : రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?
#BREAKING | The Uttar Pradesh police have tightened security across #Ayodhya after the Shri Ram Janmbhoomi Teerth Kshetra Trust received a bomb threat via email.#UttarPradesh #BombThreat pic.twitter.com/e9SR3VPKfv
— News9 (@News9Tweets) April 15, 2025
అయోధ్యలోని రామాలయం చుట్టూ దాదాపు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో భద్రతా గోడను నిర్మిస్తున్నామని, 18 నెలల్లో దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నామని శ్రీ రామ జన్మభూమి ఆలయ భవన నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. కాగా అయోధ్యలోని రామాలయానికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. 2024 సెప్టెంబర్ లో, ఒక యువకుడు సోషల్ మీడియాలో బెదిరింపు లేఖ రాశాడు. అతన్ని బీహార్‌లోని భాగల్పూర్ లో అరెస్టు చేశారు.
Also Read : ప్రీతి జింటాకు బ్యాడ్ న్యూస్... రూ. 2కోట్ల బౌలర్ ఔట్!
bomb-threat | ram-mandir | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu