/rtv/media/media_files/2025/04/15/Dgdenyhq3XkUBdFb2onY.jpg)
dil Raju big announcement
Dil Raju: సౌత్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' దెబ్బేసిన.. ఆ తర్వాత విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గట్టెక్కించింది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
BOLD. BIG. BEYOND IMAGINATION. ❤️🔥❤️🔥❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) April 15, 2025
Blockbuster Producer #Dilraju's BIG ANNOUNCEMENT TOMORROW, APRIL 16th at 11:08 AM 🎯
Stay tuned 💥 pic.twitter.com/JjhTwibxda
దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్
ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ మరో అదిరిపోయే న్యూస్ చెప్పింది. రేపు దిల్ రాజు ఓ భారీ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఉదయం 11:05 గంటలకు అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
గతేడాదే ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చాయి. అంతేకాదు దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో.. సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇటీవలే ఈ సినిమా గురించి ఓ న్యూస్ వైరల్ అయ్యింది. దీంతో దిల్ రాజ్ రేపు చెప్పబోయే బిగ్ అనౌన్స్మెంట్ ఇదేనని ప్రేక్షకులు భావిస్తున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి బృందావనం, ఎవడు, మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 2023లో కోలీవుడ్ స్టార్ విజయ్ తో కలిసి 'వారసుడు' సినిమా చేశారు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని.. ఎట్టకేలకు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
cinema-news | latest-news | dil-raju ameerkhan
Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!