Supreme Court: నా తల్లిని నిర్బంధించారు.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్‌

అస్సాంలో ఓ యువకుడు తన తల్లిని అక్రమంగా నిర్బంధించారని ఆమె ఎక్కడుందో తెలియదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెను కోర్టులో హాజరుపరచాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.

New Update
Supreme Court

Supreme Court

అస్సాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లిని అక్రమంగా నిర్బంధించారని ఆమె ఎక్కడుందో తెలియదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెను కోర్టులో హాజరుపరచాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇక వివరాల్లోకి మనోవర బెవా అనే మహిళ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పరిగణిస్తూ అస్సాం ప్రభుత్వం గతంలో ఆమెను అదుపులోకి తీసుకుంది. 

Also Read: సెక్స్ వర్కర్లలో తెలుగు స్టేట్స్ టాప్.. HIV కేసుల్లో ఇండియా నెం3!

మూడేళ్లపాటు ఆమెను నిర్బంధ శిబిరంలో ఉంచారు. అయితే 2019లో సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో నిర్బంధం నుంచి విముక్తి లభించింది. అయితే అస్సాంలో ఇటీవల ఆమెను పోలీసులు మళ్లీ నిర్బంధించారు. దీంతో తన తల్లి గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో ఆమె కొడుకు ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

Also Read: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్

పిటిషన్‌లో అతడు పలు కీలక విషయాలు ప్రస్తావించారు. '' నిర్బంధ శిబిరం నుంచి రిలీజ్ అయ్యాక నా తల్లి సుప్రీంకోర్టు షరతులు పాటిస్తోంది. ఇటీవల స్టేట్‌మెంట్‌ను నమోదుచేయాలని మా అమ్మను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అక్కడికి వెళ్లిన ఆమె మళ్లీ రాలేదు. నా తల్లికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉందని పోలీసులకు చెప్పేందుకు యత్నించా. కానీ వాళ్లు విడుదల చేసేందుకు నిరాకరించారు. మా అమ్మ ఎక్కడుందో తెలయదు. ఆమెను కోర్టులో హాజరుపర్చాలని కోరుతున్నానని'' బాధితుడు పిటిషన్‌లో తెలిపాడు. 

Also Read: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

 rtv-news | assam | national-news | Supreme Court

Advertisment
తాజా కథనాలు