Sex Workers: సెక్స్ వర్కర్లలో తెలుగు స్టేట్స్ టాప్.. HIV కేసుల్లో ఇండియా నెం3!

ఇండియాలో మరోసారి HIV కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధి సోకిన దేశాల్లో భారత్ 3 స్థానంలో ఉందని PMPSE అధ్యయనం వెల్లడించింది. మహిళా సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ మొదటి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. 

New Update
inida sex workers

Telangana and AP highest concentration of female sex workers

Sex Workers: ఇండియాలో మరోసారి HIV కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధి సోకిన దేశాల్లో భారత్ 3 స్థానంలో ఉందని ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ పాపులేషన్ సైజు ఎస్టిమేషన్ (PMPSE) అధ్యయనం వెల్లడించింది. ఇక దేశంలోనే అత్యధిక మహిళా సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ మొదటి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. 

మహిళా సెక్స్ వర్కర్లలో టాప్.. 

ఈ మేరకు 'ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ పాపులేషన్ సైజు ఎస్టిమేషన్' తాజాగా చేపట్టిన సర్వేలో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య 15.4% తో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ (12%), మహారాష్ట్ర (9.6%), ఢిల్లీ (8.9%), తెలంగాణ (7.6%) ఉన్నట్లు చెప్పారు. భారతదేశంలో మొత్తం 9,95,499 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా ఈ ఐదు రాష్ట్రాల్లోనే సగానికి పైగా (53%) ఉన్నట్లు తెలిపారు.

43,579 హాట్‌స్పాట్‌లు..

ఇక PLOS గ్లోబల్ హెల్త్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం.. 32 రాష్ట్రాల్లో 651 జిల్లాలను సర్వే చేసినట్లు పేర్కొన్నారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన ప్రదీప్ కుమార్ నేతృత్వంలో PMPSE సర్వే నిర్వహించగా.. దేశమంతటా 642 జిల్లాల్లో FSWలు ఉన్న 43,579  హాట్‌స్పాట్‌లను గుర్తించింది. వాటిలో 34 జిల్లాల్లో 5,000 కంటే ఎక్కువ FSWలు ఉన్నారు. APలో 5 జిల్లాలు, తెలంగాణలో 6 ఉన్నాయి. తెలంగాణ అత్యధికంగా FSWలున్న హాట్‌స్పాట్‌లున్నట్లు రికార్డ్ చేశారు. జాతీయంగా ప్రతి రాష్ట్రంలో సగటున 8 FSWల హాట్‌స్పాట్‌లున్నట్లు గుర్తించారు. 

పని ప్రదేశాల్లో 55.1% లైంగిక సంబంధాలు..

ఇళ్లు, ఆఫీసులు, తదితర ప్రాంతాల్లో పనులు చేసే చోట 55.1% లైంగిక సంబంధాలు కలిగివున్నట్లు PMPSE సర్వే వెల్లడించింది. 14% ఫిమేల్ సెక్స్ వర్కర్స్ 10,718 నెట్‌వర్క్ ఆపరేటర్ల ద్వారా దందా నడిపిస్తుంటే.. 9% మంది లింక్ వర్కర్ స్కీమ్ (లోకల్ సెక్స్ వర్కర్స్) ద్వారా ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. తెలంగాణలో 568 మంది మ్యాప్డ్ నెట్‌వర్క్ ఆపరేటర్లు ఉన్నారు. ఇది దేశంలోనే అత్యధికం. APలో ప్రతి గ్రామంలో LWS సగటున 10 FSWలు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు.  ఇక పురుషులతో సగటున 25 మంది లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపారు. 

 aids | telangana | telugu-news | today telugu news 

Advertisment
తాజా కథనాలు