ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. ఎన్నికల బరిలోకి దిగిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల సీఎం అతిషిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేశ్ బిధూడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని కేజ్రీవాల్ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా బీజేపీ స్పందించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసినప్పుడు కోర్టు పెట్టిన షరతులను గుర్తు చేసింది.
Also Read: విజృంభిస్తున్న క్యాన్సర్ కేసులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు
ఈ మేరకు బీజేపీ నేత ఆర్పీ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆప్‌కు సీఎం అభ్యర్థి ఉండాలేమో కానీ.. బీజేపీకి అది అవసరం లేదన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కమలం గుర్తు ఉండే చాలని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు పెట్టిన షరతులను గుర్తుచేశారు.
Also read: వారానికి 90 గంటల పని వివాదం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
''అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడూ బీజేపీ సీఎం అభ్యర్థి గురించే మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నుంచి ఆయనే సీఎం కాబట్టి.. ప్రత్యర్థిగా ఎవరుంటారని ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కోర్టు పెట్టిన రూల్స్ చూసుకుంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాలేరు. ఆయన ఎలాంటి దస్త్రాలపై కూడా సంతకాలు చేయరాదు. కనీసం సీఎం ఆఫీసుకు కూడా వెళ్లకూడదు. కోర్టు పెట్టిన ఆదేశాలు ఇంకా అమల్లో ఉన్నాయి. కేజ్రీవాల్ ప్రతీసారి మీ సీఎం అభ్యర్థి్ ఎవరూ అంటున్నారు. మా సీఎం అభ్యర్థి కమలం గుర్తే. మా పార్టీ శ్రేణులు ఆ గుర్తుతోనే ప్రతీ ఇంటికి వెళ్తారు. మలినం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారిని కోరుతారని'' ఆర్పీ సింగ్ అన్నారు.
Also Read: సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాకిస్తున్న విమాన టికెట్ ధరలు
Also Read: లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు