Cancer: విజృంభిస్తున్న క్యాన్సర్ కేసులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు

ఈ మధ్యకాలంలో క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. క్యాన్సర్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ 40 ఏళ్లు దాటిన వారిలో అత్యధికంగా పెరిగాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Cancer Patients

Cancer Patients

ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ మధ్యకాలంలో క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2024లో ఏకంగా 12 శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుండె సంబంధిత వ్యాధుల తర్వాత అత్యధికంగా ఆస్పత్రి పాలైనవారు క్యాన్సర్‌కు గురైనవారే. 2024లో ఎక్కవగా అయిదు రకాల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలైన చాలామంది హెల్త్‌ ఇన్సురెన్స్‌ కంపెనీలకు క్లెయిమ్ చేసుకున్నారు.  ఈ అయిదింటిలో శ్వాసకోస వ్యాధులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కేసులు 10 నుంచి 13 శాతం వరకు పెరిగాయి.   
అన్ని ఇన్సూరెన్స్‌ల కన్నా క్యాన్సర్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ 40 ఏళ్లు దాటిన వారిలో అత్యధికంగా పెరిగాయి. ఇందులో అత్యధికంగా మహిళలే ఉన్నారు. మగవారి కంటే మహిళల్లో 1.2 నుంచి 1.5 శాతం ఎక్కువగా ఈ కేసులు ఉన్నాయి. మరోవైపు మహిళల కంటే పురుషుల్లోనే 1.3 నుంచి 1.5 శాతం ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకున్నట్లు బిమా సంస్థల వైద్యులు చెబుతున్నారు.    
ప్రస్తుతం చూసుకుంటే క్యాన్సర్‌ చికిత్సకు ఖర్చులు 6.5 శాతం పెరిగాయి. గుండె సంబంధిత వ్యాధులకు ఏకంగా 8 శాతం పెరిగాయి. ఇక సీనియర్ సిటిజెన్లలో ఎక్కువగా కంటి సంబంధిత వ్యాధులకు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే కరోనా వచ్చిన తర్వాత శ్వాసకోస సమస్యలపై చాలామంది జాగ్రత్త వహిస్తున్నారు. కాలుష్యం వల్ల కూడా దీని తీవ్రత మరింత పెరిగింది. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రి బాట పడుతున్నారు.       
 
ప్రస్తుతం చాలామంది ఎక్కువ కాలం బతుకుతున్నప్పటికీ.. వారు ఆరోగ్యంగా ఉండటంలేదని వైద్యులు చెబుతున్నారు. మన ఆహారపు అలవాట్లు మారిపోయాయని.. అలాగే ప్రజల్లో ఒత్తిడి కూడా పెరిగిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ కేసులు ఎక్కువగా పెరిగినట్లు చెబుతున్నారు. ఇవి గుండె జబ్బులకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్సు, అంటువ్యాధులు ఈ మధ్య తగ్గినప్పటికీ.. త్వరగా ప్రాణాలకు ముప్పు ఉండని వ్యాధులు మాత్రం దీర్ఘకాలం బాధపెడుతున్నాయని అంటున్నారు. ఒకప్పుడు నగరాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ తక్కువగా ఉండేవని కానీ ఇప్పుడు మాత్రం వీటి సంఖ్య చాలావరకు పెరిగిందని చెబుతున్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు