తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పట్టణాలు, నగరాల్లో ఉండేవాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మూడు, నాలుగు నెలల క్రితమే రైళ్లకు రిజర్వేషన్ చేసినా కూడా వెయిటింగ్ లిస్ట్‌లోనే చాలామంది ఉన్నారు. రద్దీ దృష్ట్యా బస్సులు, రైళ్లు వేసినా కూడా నిమిషాల్లోనే అవి నిండిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. Also Read: పేదలకు చేయూత.. సంక్రాంతి పండక్కి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ప్రస్తుతం విమాన టికెట్లకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల నుంచి విశాఖపట్నం ప్రయాణికులకు విమాన టికెట్ ధరలు షాకిస్తున్నాయి. శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు ఫ్లైట్ టికెట్ కనీస ధర రూ.17,500లకు పైగా ఉంది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వెళ్లాలంటే కనీస ధర రూ.12 వేలు ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు కనీస ధర రూ.3400 నుంచి రూ.4 వేల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా నాలుగు రేట్లు పెరిగిపోయింది. Also Read: చర్లపల్లి To వైజాగ్ మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. రిజర్వేషన్ లేకుండానే ప్రయాణం! ఇదిలాఉండగా పండుగ వేళ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు రవాణాశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు వినియోగించాలని సూచించారు. అలాగే ఆయా బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు కూడా చేయాలని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వీటివల్ల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రజలకు కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. Also read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు