Apple: యాపిల్‌ సీవోవోగా భారత సంతతి వ్యక్తి..

ప్రముఖ యాపిల్‌ టెక్‌ కంపెనీ తమ నాయకత్వ బాధ్యతల్లో మార్పునకు శ్రీకారం చుట్టింది. భారతీయ మూలాలున్న సబిహ్‌ ఖాన్‌ ఈ నెల చివర్లో.. చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (COO) బాధ్యతలు స్వీకరించనున్నారు. యాపిల్ సంస్థలో ఈయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.

New Update
Apple’s senior vice president  Sabih Khan to take charge as  COO

Apple’s senior vice president Sabih Khan to take charge as COO

ప్రముఖ యాపిల్‌ టెక్‌ కంపెనీ తమ నాయకత్వ బాధ్యతల్లో మార్పునకు శ్రీకారం చుట్టింది. భారతీయ మూలాలున్న వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించింది. చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (COO) జెఫ్‌ విలియమ్స్ కంపెనీని వీడనున్నారు. ఈ క్రమంలోనే ఈ బాధ్యతలను యాపిల్ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ సబిహ్ కాన్‌కు అప్పగించనున్నారు. జులై చివర్లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక డిజైనింగ్ టీమ్ బాధ్యతలను నేరుగా టీమ్‌కుక్‌ స్వీకరించనున్నారు.  

Also Read: ఆధార్‌ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదు.. ఉడాయ్ సీఈవో కీలక వ్యాఖ్యలు

Also Read :  కర్ణాటకలో సీఎం మార్పు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్‌

Apple COO Sabih Khan

భారతీయ మూలాలున్న సబిహ్‌ ఖాన్‌కు యాపిల్ సంస్థలో 30 ఏళ్ల అనుభవం ఉంది. గత ఆరేళ్ల నుంచి ఆయన యాపిల్ గ్లోబెల్ సప్లై ఛైన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉత్పత్తి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే సబిహ్ ఖాన్‌ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లాలో జన్మించారు. అక్కడ అయిదవ తరగతి వరకు ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత ఖాన్ కుటుంబం సింగపుర్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడ ఆయన పాఠశాల విద్యాభ్యాసం ముగిశాక.. వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. 

Also Read: డబుల్ ఇంజిన్‌ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు

ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఆయన బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పట్టా కూడా అందుకున్నారు. 1995లో ఆయన యాపిల్ ప్రొక్యూర్‌మెంట్‌ గ్రూప్‌లో కూడా పనిచేశారు. అంతకుముందు జీఈ ప్లాస్టిక్స్‌లో డెవలప్‌మెంట్ ఇంజినీర్, అకౌంట్‌ టెక్నికల్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (COO) బాధ్యతలు అందుకోనున్నారు. 

Also Read :  ముసుగులో మెరిసిపోతున్న అనసూయ.. ట్రెడిషనల్ భలే ఉంది!

apple-company | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు