/rtv/media/media_files/2025/11/19/afridi-2025-11-19-10-28-21.jpg)
ఫైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ కు గత నెలలో సోహైల్ ఆఫ్రిది సీఎం అయ్యారు. ఈయన తాజాగా పాక్ ప్రభుత్వంపై ారోపణలు చేశారు. ఖైబర్ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద సంఘటనలను సృష్టిస్తోందని ఆరోపించారు. శాంతి కోసం చేస్తున్న తమ ప్రయత్నాలను అడ్డకుంటోందని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన పష్తూన్ తహాఫుజ్ మూమెంట్ సభ్యులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. దీన్ని అఫ్రిది తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్, తమకు మధ్య ఏర్పడిన సంబంధాలను అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తోంని అఫ్రిది ఆరోపించారు.
సొంత ప్రజలపై దాడులు చేస్తూ..
ఖైబర్ పంఖ్తుఖ్వాలో కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలను సీఎం అఫ్రిది తీవ్రంగా ఖండించారు. సాయుధ దళాలు ఉగ్రవాద ఏరివేత పేరుతో పౌరులను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సొంత ప్రజలనే చంపుతూ..ఉగ్రవాదంపై యుద్ధం అని పేరు పెడుతున్నారని అన్నారు. శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించేవారిని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఇటీవల పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని తిరా లోయలోని పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో అనేకమంది మహిళలు, చిన్నారులతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు, సైనిక కార్యకలాపాలను సమర్థించుకునేందుకు ఇస్లామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతుందని అఫ్రిది ఆరోపించారు.
అంతకు ముందు అక్టోబర్ లో కూడా ఖైబర్ పఖ్తుంఖ్వాలో పోలీసులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. పెషావర్ బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. పోలీస్ అధికారులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయడ్డారు. ఈ దాడిని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించింది. దీని తరువాత అక్కడ పెద్ద భద్రతా బలగాలను మోహరించారు. పేలుడికి కారణమైన పరికరాన్ని పోలీసులు తిరిగే మార్గంలో అమర్చారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
also Read: Trump: జర్నలిస్ట్ ఖషోగ్గి హ్యతపై సౌదీ ప్రిన్స్ కు ప్రశ్న..రిపోర్ట్ పై అరిచిన ట్రంప్
Follow Us