Asaduddin Owaisi: ఢిల్లీ ఆత్మాహుతి దాడిపై.. MP అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఆత్మాహుతి దాడి గురించి ఉమర్‌ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం రెండూ ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు X వేదికగా పోస్టు పెట్టారు.

New Update
Asaduddun owaisi Sensational Comments on Pakistan

Asaduddun owaisi Sensational Comments on Pakistan

ఢిల్లీ ఎర్రకోట ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ నబీ(delhi bomber dr umar video)కి వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందులో అతడు ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ మాట్లాడాడు. వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్‌గా అతడు అభివర్ణించారు. అయితే, ఆత్మాహుతి దాడి గురించి ఉమర్‌ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం రెండూ ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు X వేదికగా పోస్టు పెట్టారు.

Also Read :  భారత్‌కు వచ్చిన లారెన్స్‌ బిష్ణోయ్ సోదరుడు.. ఇతడి గురించి తెలిస్తే..!

MP Asaduddin Owaisi Sensational Comments

Also Read :  శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి

ఢిల్లీ పేలుళ్ల(delhi blast case) నిందితుడు ఉమర్‌ నబీ ఆత్మాహుతి బాంబు దాడిని సమర్థిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. సూసైడ్‌ బాంబింగ్‌ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని.. వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్‌గా అతడు చెప్పుకొచ్చాడు. ఆ వీడియోని ఓవైసీ తప్పుబట్టాడు.. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం ఘోరమైన పాపం. ఇలాంటి చర్యలు దేశ చట్టాలకు కూడా పూర్తి విరుద్ధం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఇది ముమ్మాటికే ఉగ్రవాదమే’ అని ఒవైసీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు దేశ రాజధాని సమీపంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, ఢిల్లీ పేలుడుతో ముడిపడి ఉన్న ఉగ్రవాద మాడ్యూల్‌పై ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘గత 6 నెలల్లో స్థానిక కశ్మీరీలు ఎవరూ ఉగ్రవాద సంస్థల్లో చేరలేదని ఆపరేషన్ సిందూర్, మహదేవ్ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలిపారు. మరి ఈ గ్రూపు ఎక్కడి నుంచి వచ్చింది..?’ అంటూ ఆయన నిలదీశారు. ప్రస్తుతం ఒవైసీ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు