US investment visas: అమెరికా పెట్టుబడుల వీసాలకు డిమాండ్‌.. ఆసక్తి చూపుతున్న భారతీయులు

అమెరికాలో హెచ్‌1 బీ వీసాలు దొరకడమే కష్టంగా మారిన సంగతి తెలిసిందే. అయితే వ్యాపారాలకు అవసరమైన ఈబీ 5 వీసాలకు మాత్రం డిమాండ్‌ తగ్గడం లేదు. దీంతో అమెరికాలో పెట్టుబడులు పెట్టేందులు ఎక్కువగా భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు.

New Update
Amid curbs on H1B and student visas, more Indians are lining up for US investment visas

Amid curbs on H1B and student visas, more Indians are lining up for US investment visas

అమెరికాలో హెచ్‌1 బీ వీసాలు దొరకడమే కష్టంగా మారిన సంగతి తెలిసిందే. అయితే పెట్టుబడులు, వ్యాపారాల కోసం అవసరమయ్యే ఈబీ 5 వీసాలకు మాత్రం డిమాండ్‌ తగ్గడం లేదు. దీంతో అమెరికాలో పెట్టుబడులు పెట్టేందులు ఎక్కువగా భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఈబీ 5 వీసాలను ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన గోల్డ్‌కార్డులతో కూడా భర్తీ చేయనున్నారు. అయితే ఈబీ5 దరఖాస్తులకు సంబంధించి డేటాను చూస్తే.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారతీయులు దీనికోసం ఏడాది వ్యవధిలోనే భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.   

Also Read: కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక.. నిరాశ చెంది తండ్రి ఏం చేశాడంటే?

2024 ఏప్రిల్ నుంచి భారతీయుల్లో ఈబీ 5 వీసాలకు ఆదరణ పెరగడం మొదలైంది. యునైటెట్‌ స్టేట్స్ ఇమిగ్రేషన్ ఫండ్ డేటా '2025 ఆర్థిక సంవత్సరంలో (అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025) భారతీయుల నుంచి 1200లకు పైగా ఐ526ఈ పిటిషన్లు వచ్చాయి. ఈ విషయాన్ని యూఎస్‌ఐఎఫ్‌ సీఎంవో నికోలస్ మాస్ట్రోన్నీ చెప్పారు. అయితే ఇతర రకం వీసాలు జారీ చేయడంలో పెద్దసంఖ్యలో బ్యాక్‌లాగ్ ఉండటం వల్లే ఈబీ5కి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా H1B, గ్రీన్‌కార్డుల జారీ చేయడం కూడా కష్టంగా మారింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ సంస్థ వద్ద దాదాపు 1.1 కోట్ల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందుకే వేగంగా వచ్చే ఈబీ5 వీసాను అమెరికా శాశ్వత నివాసానికి మార్గంగా ఎంచుకుంటున్నారు .  

Also Read: పహల్గామ్ ఉగ్రదాడి పక్కా పాక్ పనే.. POKలో టెర్రరిస్ట్ అంత్యక్రియలే ఆధారాలు

‘ఇన్వెస్ట్‌ ఇన్‌ ది యూఎస్‌ఏ’ సంస్థ డేటా ప్రకారం చూసుకుంటే 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయులకు 1428 ఈబీ5 వీసాలు జారీ అయ్యాయి. కానీ 2023లో మాత్రం కేవలం 815 మాత్రమే జారీ చేశారు. మరోవైపు గ్రీన్‌కార్డు కోసం అమెరికా ప్రభుత్వం రూల్స్ మరింత కఠినం చేసింది. కుటుంబ సభ్యులకు ఇచ్చే ఇమిగ్రెంట్ వీసాలను సైతం స్క్రీనింగ్, వెట్టింగ్‌ విధానాన్ని కఠినతరం చేసింది. అనర్హుల అప్లికేషన్లు తొలగించేందుకే దీన్ని చేపట్టినట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.  

Also Read: 'నిజమైన భారతీయులు అలా మాట్లాడరు'.. రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఫైర్

మరోవైపు కొత్త నిబంధనలు కూడా ఆగస్టు 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ రూల్స్‌ను పెండింగ్‌లో ఉన్నవారికి, కొత్తగా దరఖాస్తు చేసున్నవాళ్లకి వర్తింపజేయనున్నారు. ఫేక్‌ వివాహాలు చేసుకొని అమెరికాకి రావాలనుకునేవాళ్లను అడ్డుకోవడం దీని లక్ష్యం. ఇక నుంచి వివాహాలకు సంబంధించి వాళ్లు అధికారులకు మరింత సమాచారం అందించాల్సి ఉంటుంది. అలాగే వీసాకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు కూడా వ్యక్తిగతంలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో స్పాన్సర్‌ ఎవరికైనా స్పౌస్‌ వీసాలు జారీ చేసినా, ఇమిగ్రేషన్ రికార్డుల్లో ఏమైనా తేడాలున్నా కూడా వాటిపై యూఎస్‌సీఐఎస్‌ మరింత ఫోకస్‌ పెట్టింది . 

Also Read: హమాస్‌ భూగర్భ సొరంగంలో ఇజ్రాయెల్ బందీ.. తిండి లేక, బక్క చిక్కిన శరీరంతో దీన స్థితి

Advertisment
తాజా కథనాలు