Crime News: కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక.. నిరాశ చెంది తండ్రి ఏం చేశాడంటే?

కేరళకు చెందిన ఓ తండ్రి కుమారుడి కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇదే కాకుండా తన భార్య జీతం 12 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. ఆర్థిక సమస్యలు, కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక తండ్రి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
Tirupati Crime News

Crime News

కేరళకు చెందిన ఓ తండ్రి కుమారుడి కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో కాలేజీ ఫీజులు ఎక్కువగా ఉంటున్నాయి. కేవలం కాలేజీ ఫీజులు మాత్రమే కాదు.. చిన్న పిల్లల స్కూల్ ఫీజులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని కట్టలేక చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. మంచి కాలేజీలో పిల్లలను చదివించి, వారు కెరీర్‌లో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి స్తోమతకు మించి పిల్లలను చదివిస్తున్నారు. కొందరు ఇలాంటి ఫీజులు కట్టలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కేరళలో చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి: Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్

కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక..

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఓ తండ్రి కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 47 ఏళ్ల వీటీ షిజో మృతదేహం ముంగంపర అడవిలో వేలాడుతూ కనిపించారు. షిజో ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం కాలేజీ ఫీజు కట్టలేక నిరాశ చెందడమే. ఇటీవల షిజో కొడుకు ఇంజనీరింగ్ కాలేజీకి ఎంపికయ్యాడు. తన కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు ఏర్పాటు చేయలేకపోయాడు. దీంతో షిజో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని కొడుకుకి తమిళనాడులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ లభించింది. ఇందులో తప్పకుండా ఫీజు చెల్లించాలి. ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీ ఫీజులను కుటుంబం కట్టలేకపోయింది. 

ఇది కూడా చూడండి: Wife Killed Husband: పొరిగింటి యువకుడితో ఎఫైర్.. యూట్యూబ్‌లో చూసి భర్తను చంపించిన మహిళ

12 ఏళ్లుగా జీతం పెండింగ్..

ఇదే కాకుండా ఆమె భార్య స్కూల్ టీచర్ పెండింగ్ జీతం కూడా 12 ఏళ్ల నుంచి రావడం లేదు. ఈ జీతం రాకపోవడం వల్ల కుటుంబంలో సమస్యలు ఎక్కువయ్యాయి. ఎంతగానో షిజో కుటుంబం ఈ పెండింగ్ జీతం కోసం ఎదురు చూస్తోంది. దీంతో కోర్టును ఆశ్రయించగా కొన్ని నెలల నుంచి జీతం అందుతోంది. కానీ గత 12 ఏళ్ల నుంచి ఉన్న పెండింగ్ జీతాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జాప్యం చేస్తున్నారని సమాచారం. ఆర్థిక సమస్యలు, భార్య పెండింగ్ జీతం, కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక తీవ్రంగా మనస్తాపం చెంది షిజో సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

Advertisment
తాజా కథనాలు