Rahul Gandhi: 'నిజమైన భారతీయులు అలా మాట్లాడరు'.. రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఫైర్

విపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఆక్రమణ జరిగింది మీకెలా తెలుసని సుప్రీం ధర్మాసనం ఆయన్ని ప్రశ్నించింది.

New Update
True Indian wouldn't like that, Supreme court raps Rahul Gandhi over China claim, halts case

True Indian wouldn't like that, Supreme court raps Rahul Gandhi over China claim, halts case

Rahul Gandhi:

కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో చైనా(china).. భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2 వేల కిలోమీటర్ల వరకు ఈ ఆక్రమణ జరిగిందని.. ఈ అంశాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం ధ్వజమెత్తింది. చైనా 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించినట్లు ఆయన చేసిన ఆరోపణలను తప్పుబట్టింది.

Also Read: పొరిగింటి యువకుడితో ఎఫైర్.. యూట్యూబ్‌లో చూసి భర్తను చంపించిన మహిళ

ఆక్రమణ జరిగిందన్న విషయం మీకేలా తెలుసని ప్రశ్నించింది. దీనికి విశ్వసనీయత ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించింది. నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని మందలించింది. అయితే రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది దీనిపై వాదించారు. దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకుంటే రాహుల్ విపక్ష నేత ఎలా అవుతారని సుప్రీం ధర్మాసనాన్ని ప్రశ్నించారు. దీనిపై జస్టిస్‌ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏదైనా సమస్య లేదా అంశం గురించి మాట్లాడాలంటే పార్లమెంట్‌లో మాట్లాలని చెప్పింది. ఇలా సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. ఇలాంటి సమస్యలను పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించలేదని అడిగింది. ఈ కేసుపై స్టే విధించింది. 

Also Read: ధర్మస్థల తొవ్వకాల్లో సంచలనం.. 11వ స్పాట్లో ఏం దొరికాయో తెలుసా?

ఇదిలాఉండగా 2022లో రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఆయన దేశ భద్రతకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 జూన్‌లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా ఆర్మీతో భారత సైనికులకు ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్ దీనిపై కేంద్రంపై విమర్శలు చేశారు. చైనా 2 వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని అన్నారు. ఇది ఢిల్లీ వైశాల్యం కన్నా ఎక్కువ ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దీనిగురించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదని మండిపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.  

Also Read: పహల్గామ్ ఉగ్రదాడి పక్కా పాక్ పనే.. POKలో టెర్రరిస్ట్ అంత్యక్రియలే ఆధారాలు

భారత భూభాగాన్ని తిరిగివ్వాలని మన ఆర్మీ చైనాతో చర్చలు జరిపిందని కానీ ప్రధాని మోదీ ఈ అంశంలో అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ప్రధాని అసలు భూ ఆక్రమణే జరగలేదని చెబుతున్నారంటూ విమర్శించారు. దీని గురించి ఏ మీడియా కూడా ప్రశ్నించలేది.. దీన్ని దేశమంతో గమనిస్తోందని పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. కొంతమంది రాహుల్ వ్యాఖ్యలను సమర్థించగా.. మరికొందరు కొట్టిపారేశారు. ఇక చివరికి భారత సైన్యాన్ని రాహుల్‌ అవమానించేలా మాట్లాడారని ఆరోపణలు చేస్తూ 2022లో ఆయనపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైనే తాజాగా అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.  

Advertisment
తాజా కథనాలు