/rtv/media/media_files/2025/02/05/Zj7ALohXCHBZ2rvY3RW0.jpg)
Ambedkar Statue Vandalism in Punjab
Ambedkar Statue: ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా పంజాబ్(Punjab)లోని అమృత్‌సర్(Amritsar)లో 33 అడుగులు బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) విగ్రహాన్ని పలువురు దుండగులు ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపింది. ఈ ఘటనపై వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను టార్గెట్ చేసింది. ఈ ఘటనకు బాధ్యలైనవారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని.. దళిత సామాజిక వర్గాన్ని కేజ్రీవాల్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు గుప్పించింది.
Also Read: చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దు.. కేంద్రం సంచలన ప్రకటన
కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండించింది. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ఆప్‌కు ఖలిస్థానీతో సంబంధాలున్నాయని చెబుతూ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం
పంజాబ్‌లో రాజకీయ దుమారం..
మరోవైపు వివిధ దళిత సంఘాలు కూడా దుండుగలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. పంజాబ్ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రదేశాల్లో భద్రత కల్పించాలని కోరాయి. ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్‌లో రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా వెంటనే బాధ్యులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత ఓటింగ్ శాతమంటే ?
Also Read: పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!