Andhra Pradesh : అంబేద్కర్ విగ్రహంపై దాడి.. వైసీపీ శ్రేణుల నిరసన..!
విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా కడపలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి హేయమైన చర్య అని కొవ్వొత్తులతో నిరసన చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.