Maargan: విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ ‘మార్గన్’ నుంచి తొలి ఆరు నిమిషాల విజువల్స్‌ను విడుదల చేశారు మేకర్స్. లియో జాన్‌పాల్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఫుల్ సస్పెన్స్ , మిస్టరీగా సాగిన ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది.
Also Read:Chiranjeevi: యంగ్ ప్రొడ్యూసర్ తో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. 'కుబేరా' ఈవెంట్ లో అదిరే అప్డేట్!
మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్
'మార్గన్' సినిమాను ఒక అంతుపట్టని మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. కథలో ఊహించని మలుపులు, సస్పెన్స్ ఎలిమెంట్స్, భావోద్వేగ సన్నివేశాలును కలగలుపుతూ కొత్త కొత్త అనుభూతి కలిగించేలా సినిమాను తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్ తొలిసారి విలన్ పాత్రలో వెండితెరకు పరిచయం కానున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి.
Also Read: Game Changer: 'గేమ్ ఛేంజర్' ఓ తప్పుడు నిర్ణయం.. రామ్ చరణ్ సినిమాపై దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్
#MAARGAN - The first 6 minutes OUT NOW 💉🩸
— vijayantony (@vijayantony) June 25, 2025
Tamil ⛓️💥 https://t.co/RdeA2u36zz
Telugu ⛓️💥 https://t.co/grVwS9zD72#maarganfromjune27@leojohnpaultw@AJDhishan990@mrsvijayantony@vijayantonyfilm@SureshProdns@SpiritMediaINpic.twitter.com/fmre1oggnt
ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రీతిక, బ్రిగిడా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. అయితే విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి స్వయంగా సంగీతం అందించారు. మార్గన్ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఇంకా పెరుగుతోంది. మరి ఈ చిత్రానికి థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read:Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్