Jio- airtel: ఎయిర్‌టెల్‌ బిగ్‌ షాక్‌..1జీబీ ప్లాన్‌కు గుడ్‌ బై

ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌ టెల్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఎంట్రీలెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.249కు గుడ్‌ బై చెప్పేసింది. దీంతో బుధవారం అంటే ఆగస్టు 20 నుంచి ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ యూజర్లకు అందుబాటులో ఉండదన్న మాట.

New Update
Airtel's big shock..goodbye to 1GB plan

Airtel's big shock..goodbye to 1GB plan

Jio- airtel : ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌ టెల్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఎంట్రీలెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.249కు గుడ్‌ బై చెప్పేసింది. దీంతో బుధవారం అంటే ఆగస్టు 20 నుంచి ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ యూజర్లకు అందుబాటులో ఉండదన్న మాట.  తొలుత జీయో 1 జీబీ డేటా ప్లాన్‌ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎయిర్‌టెల్‌కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవడం గమనార్హం. రెండు ప్రధాన టెలికాం సంస్థలు ఈ నిర్ణయం తీసుకోవడంతో  వొడాఫోన్‌ ఐడియా  కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?

ఎయిర్‌టెల్‌ఎంట్రీలెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.249కు 24 రోజులు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌తో ప్రస్తుతం ఈ ప్యాక్‌ అందిస్తోంది. అయితే దీన్ని ఎత్తివేయడంతో ఇకమీదట  ప్రతి వినియోగదారుడు కనీస రీఛార్జి రూ.319 చేసుకోవాలి. అయితే ఈ ప్యాక్‌ నెలరోజుల వ్యాలిడిటీతో పనిచేస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా మాత్రమే  రూ.299కు రోజుకు 1జీబీ/డాటా ప్లాన్‌ను అందిస్తోంది. అయితే ఇది కూడా అదే బాటలో నడవొచ్చు. మొదటిసారి జియో..:రోజుకు1 జీబీ డేటా28 రోజులకు అందించే ప్లాన్‌ను నిలిపివేసింది. దీంతో ఇక మీదట రోజుకు 1.5 జీబీ  అందించే ప్లాన్‌ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ మార్పు అమల్లోకి తీసుకొచ్చింది. జియో వెబ్‌సైట్‌లో 1జీబీ ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌ను క్లోజ్‌ చేసింది. ప్రస్తుతం రూ.299తో 28 రోజులకు రోజుకు1.5 జీబీ డేటా, రూ.349తో  రోజుకు 2 జీబీ డేటా అందించే  ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.  

Also Read: మళ్ళీ హాట్ టాపిక్ అయిన జెలెన్ స్కీ డ్రెస్..రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు


కాగా, ప్రస్తుతం ఉన్న ఎంట్రీ లెవల్‌ ప్లాన్లు సవరించడం వల్ల వినియోగదారులు కనీసం రోజుకు 1.5జీబీ అందించే ప్లాన్‌కు మారాలి. దీంతో యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయాలు (ARPU) కూడా పెరుగుతాయి. అయితే జియో యూజర్లలో 20-25 శాతం మంది మాత్రమే 1జీబీ ప్లాన్‌ వాడే వాళ్లుంటారని అంచనా. ఎయిర్‌టెల్ వినియోగదారులలో 18-20 శాతం మంది మాత్రమే ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌ వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ ప్లాన్లు తొలగించడం వల్ల ఆయా టెలికాం సంస్థల ఆదాయాలు 4-7 శాతం వరకు అంటే సగటున ఆదాయం రూ.10-13 వరకు పెరుగుతుందని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!

Advertisment
తాజా కథనాలు