/rtv/media/media_files/2025/08/18/singer-rahulsipligunj-got-engaged-2025-08-18-12-46-31.jpg)
singer Rahul Sipligunj got engaged
Rahul Sipligunj Engagement: టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తాజాగా హరిణి రెడ్డి అనే అమ్మాయిని ఘనంగా నిశ్చితార్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా ప్రైవేట్ గా ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని రాహుల్ ఇంకా రివీల్ చేయనప్పటికీ.. నిశ్చితార్దానికి వెళ్లిన అతిథులు ఫొటోలు షేర్ చేయడంతో అందరికీ తెలిసిపోయింది. ఈ ఈ పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతుండగా.. ఇవి చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా రాహుల్ సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చాడు. అయితే రాహుల్ తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ వేడుకలో రాహుల్ పాస్టెల్ ల్యావెండర్ షేర్వాణీ ధరించగా.. అతడి కాబొయ్యే భార్య హరిణి రెడ్ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపించారు.
Singer #RahulSipligunj get engaged 🎊🎊🎊🎉🎉🎉🎉🎉
— Sreedhar Sri (@SreedharSri4u) August 18, 2025
Congratulations anna✨✨✨🎁🎁🎁 pic.twitter.com/8dGqU1DIfF
ఆస్కార్ తో కోటి రూపాయలు!
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన రాహుల్.. గల్లీ సింగర్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఆస్కార్ స్థాయికి ఎదిగాడు. ఎంతో మంది అప్ కమింగ్ సింగర్స్ కి స్ఫూర్తిగా నిలిచాడు. కీరవాణి మ్యూజిక్ లో రాహుల్, కాలభైరవ పాడిన పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఆస్కార్ స్థాయికి వెళ్లిన మొదటి తెలంగాణ సింగర్ గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రాహుల్ ప్రతిభకు గుర్తుగా కోటి రూపాయల చెక్కును బహుమతిగా ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాహుల్ ఈ రివార్డ్ అందుకున్నాడు.
రాహుల్ 2009లో వచ్చిన నాగ చైతన్య "జోష్" సినిమాలో "కాలేజ్ బుల్లోడా" పాటతో తన సినీ కేరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత 'దమ్ము ' సినిమాలో వాస్తు బాగుందే", రామ్ చరన్ రచ్చ మూవీలో "సింగరేణి ఉంది" వంటి పాటలతో మంచి గుర్తింపు పొందాడు. రంగస్థలం లో 'రంగ రంగ రంగస్థలాన' మహర్షిలో 'పాలపిట్ట ' సాంగ్స్ రాహుల్ ని స్టార్ రేంజ్ కి తీసుకెళ్లాయి. "నాటు నాటు". ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో అంతర్జాతీయంగా రాహుల్ కి గుర్తింపు లభించింది.
అయితే కేరీర్ మొదట్లో తన సొంత ఆల్బమ్స్ తో పాపులర్ అయ్యాడు రాహుల్. గల్లీ కా గణేష్, మగజాతి, మాకికిరికిరి, దావత్, పూర్ బాయ్ వంటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ ఫెమ్ తోనే సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకున్నాడు రాహుల్ .
సింగింగ్ తో పాటు పలు సినిమాల్లో తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు రాహుల్. రంగమార్థండా సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ జోడీగా మేల్ లీడ్ పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులు , విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా కూడా నిలిచాడు.