/rtv/media/media_files/2025/06/15/6vB4DxuVVT0fkWgkIUyC.jpg)
Air India plane crash, Former Gujarat CM Vijay Rupani’s body identified
Vijay Rupani:
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాణీ కూడా మృతి చెందారు. అయితే ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. ఈ విషయాన్ని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
విజయ్ రూపాణీ కుటుంబ సభ్యుల శాంపిల్స్‌తో మృతదేహం DNA మ్యాచ్ అయ్యిందని పేర్కొన్నారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. ఇదిలాఉండగా ఇప్పటిదాకా 32 మంది మృతుల DNA.. వాళ్ల కుటుంబ సభ్యులతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ వైద్యుడు వెల్లడించారు. ఇప్పటిదాకా 14 మంది మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
Also Read: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. మహారాష్ట్ర పౌరులను అవమానించారన్న సీఎం
అలాగే పరీక్షతో పనిలేకుండానే బాధిత బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను వాళ్లకి అప్పగించినట్లు చెప్పారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయని తెలిపారు. వాటికి ప్రస్తుతం DNA టెస్టులు కొనసాగుతున్నాయన్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటంతో మృతదేహాలను గుర్తించడం ఆలస్యం అవుతోందని చెప్పారు. మరోవైపు బాధిత కుటుంబాలతో సమన్వం చేసుకునేందుకు ఇప్పటికే 230 బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీ కుటుంబాలను కూడా సంప్రదించినట్లు తెలిపారు.
Also Read: అణు ముప్పు సాకు మాత్రమే..అసలు టార్గెట్ ఇరాన్ ప్రభుత్వం కూల్చివేతే..
Follow Us