Bomb threat : ఎయిరిండియాకు తప్పని కష్టాలు.. బాంబు బెదిరింపుతో రియాద్‌కు దారి మళ్లింపు

ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థకు ఇప్పట్లో కష్టాలు తప్పేట్లు లేవు. తాజాగా బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీ కి బయిలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్‌ కు దారి మళ్లించారు. తనిఖీల అనంతరం బాంబు లేదని తేల్చారు.

New Update
Air India

Air India Diversion to Riyadh due to bomb threat

Bomb threat :  ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థకు ఇప్పట్లో కష్టాలు తప్పేట్లు లేవు. అహమ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత ఆ సంస్థను వరుసగా వివదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీ కి బయిలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్‌ కు మళ్లించారు. అక్కడికి చేరిన వెంటనే ప్రయాణీకులను కిందకు దింపి బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.  ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీ చేసి బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

AI-114 నెంబర్‌ గల ఎయిరిండియా విమానం శనివారం రాత్రి 8.26 గంటలకు బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.  విమానం బయలు దేరిన తర్వాత కొంత సమయానికి విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగులు కాల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ విమానాన్ని అత్యవసరంగా రియాద్‌కు దారి మళ్లించారు. రియాద్‌ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ కాగానే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. 

Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..

విమానంలో బాంబు కోసం భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. కానీ అందులో ఎలాంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు రియాద్‌లోని ఓ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విమానం రియాద్‌లోని కింగ్‌ ఖాలీద్‌ అంతర్జాతీయ విమనాశ్రయంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఎయిర్‌ ఇండియా సంస్థకు వరుసగా వివాదాలు చుట్టు ముట్టడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

Advertisment
తాజా కథనాలు