Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చివరికీ

గుజరాత్‌లో విమాన ప్రమాద ఘటన మరువక ముందే మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూపీ నుంచి కోల్‌కతాకు బయలుదేరిన మరో ఎయిరిండియా విమానంలో టేకాఫ్‌కు ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ ఫ్లైట్ సర్వీసును నిలిపివేశారు.

New Update
Air India Express Flight To Kolkata Delayed, Plane On Runway For An Hour

Air India Express Flight To Kolkata Delayed, Plane On Runway For An Hour

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపంతో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ హిండోన్ విమానశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.  

Also Read: మహారాష్ట్ర పూణెలో కుప్పకూలిన వంతెన పలువురు మృతి.. 25 మంది గల్లంతు

దీంతో ఫ్లైట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు. తాజాగా పరిణామంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఎదురుచూస్తున్నారు. చివరికి వాళ్లందరినీ కోల్‌కతాకు తీసుకెళ్లేందుకు ఎయిరిండియా సిబ్బంది మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే విమానం టేకాఫ్‌కు ముందే సాంకేతిక సమస్య బయటపడింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read: ఇరాన్ ఆయిల్ గోడౌన్స్ నుంచి గ్యాస్, అణు కర్మాగారం వరకు.. దేన్నీ వదలని ఇజ్రాయెల్.. వీడియోలు వైరల్!

ఇదిలాఉండగా ఇటీవల అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఎయిరిండియా ఫ్లైట్‌ లండన్‌కు బయలుదేరింది. విమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘాని నగర్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 274 మంది మ-ృతి చెందారు. ఈ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలడంతో అందులో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు, వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: నైజీరియాలో దారుణం.. 100 మందిని బంధించి సజీవ దహనం!

Also Read: స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 లో పెద్ద లోపం...గుర్తించిన ఇస్రో

Advertisment
Advertisment