AIIMS: ఆత్మహత్యలు ఆపేందుకు ఎయిమ్స్‌ వినూత్న ప్రయత్నం

ఢిల్లీ ఎయిమ్స్‌ ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సూసైడ్‌లను అరికట్టేందుకు కృత్రిమ మేధ(AI) ఆధారిత యాప్‌ను బుధవారం ఆవిష్కరించింది. ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం సందర్భంగా 'నెవర్ ఎలోన్' పేరిట దీన్ని ప్రారంభించింది.

New Update
AIIMS launches AI-based app to tackle suicides

AIIMS launches AI-based app to tackle suicides

ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లేవారే జీవనం కొనసాగిస్తారు. వీటిని భరించలేని కొందరు ఆత్మహత్యలు(Suicides) చేసుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే విద్యార్థులు ఎక్కువగా సూసైడ్‌కు పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని, చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామనే కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌ ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. 

Also Read: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం

AIIMS launches AI-Based App Never Alone

విద్యార్థుల సూసైడ్‌లను అరికట్టేందుకు కృత్రిమ మేధ(AI) ఆధారిత యాప్‌(AI-Based App) ను బుధవారం ఆవిష్కరించింది. ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం(World Suicide Prevention Day) సందర్భంగా 'నెవర్ ఎలోన్' పేరిట దీన్ని ప్రారంభించింది. ఈ యాప్‌తో కళాశాల, యూనివర్సిటీ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించవచ్చని మానసిక విభాగం ప్రొఫెసర్ డా.నందకుమార్ తెలిపారు. అంతేకాదు విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు కూడా గుర్తించవచ్చని పేర్కొన్నారు. 

Also Read: ముసలోడు కాదు...మూర్ఖుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

దీనివల్ల వాళ్లు ఆత్మహత్యలు చేసుకోకుండా కౌన్సెలింగ్ ఇచ్చి జీవితంపై ఆసక్తిని కలిగించవచ్చని చెప్పారు. ఎయిమ్స్‌(aiims) భువనేశ్వర్‌తో పాటు  షాహ్‌దరాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (IHBAS) కూడా ఈ యాప్‌ను ప్రారంభించాయి.  

Also Read: అమెరికాలో హై టెన్షన్.. ట్రంప్ సన్నిహితుడి దారుణ హత్య!

Advertisment
తాజా కథనాలు