Special Trains: చేతులు కాలాక ఆకులు..తొక్కిసలాట తర్వాత రైల్వేశాఖ కీలక నిర్ణయం

కుంభమేళా రైళ్ళ కోసం జనం ఎగబడ్డంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్ రాజ్ కు మరో నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను వేసింది. 

author-image
By Manogna alamuru
New Update
Special Trains

Special Trains

 దాదాపు 20 రోజుల నుంచీ కుంభమేళా జరుగుతోంది. దేశంలో అన్ని నగరాల నుంచీ ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వెళుతున్నారు. ప్రతీరోజూ రైళ్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఎప్పుడూ లేనంతగా కుంభమేళాకు ప్రజలు తరలివస్తున్నారు. ఈసారి కుంభమేళా రికార్డ్ సృష్టించింది.  ఇవన్నీ రోజూ వార్తల్లో వస్తున్నాయి. సామాన్య జనానికి కూడా తెలుస్తోంది. కానీ రైల్వేశాఖకు మాత్రం తెలియలేదు. ప్రమాదం జరిగితేనే కానీ కళ్ళు తెరవలేదు. ఇప్పుడు ఢిల్లీలో భారీ ప్రమాదం జరిగి..18 మంది ప్రాణాలు పోయాక, తీరిగ్గా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్కు మరో 4 స్పెషల్ ట్రైన్స్ను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ పనేదో ముందే చేసి ఉంటే ఇంత జరగకపోయి ఉండేది కదా అని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రాణ నష్టం జరిగాక దిద్దుబాటు చర్యలకు రైల్వే శాఖ ముందుకు రావడం సిగ్గుచేటని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు ఈ ట్రైన్స్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాక, ప్రయాణికుల రద్దీ తగ్గిందని అందులో రాయడం ఏంటని మండిపడుతున్నారు.

కుంభమేళా స్పెషల్ ట్రైన్స్ వివరాలు:

  1. ట్రైన్ నెంబర్ 04420 (న్యూఢిల్లీ to ప్రయాగ్ రాజ్) 16.02.2025 రాత్రి 7 గంటలకు..
    2.  ట్రైన్ నెంబర్ 04422 (న్యూఢిల్లీ to ప్రయాగ్ రాజ్) 16.02.2025 రాత్రి 9 గంటలకు..
    3. ట్రైన్ నెంబర్ 04424 (ఆనంద్ విహార్ టెర్మినల్ to ప్రయాగ్ రాజ్) 16.02.2025 రాత్రి 8 గంటలకు..
    4. ట్రైన్ నెంబర్ 04418 (న్యూఢిల్లీ to దర్బాంగా జంక్షన్) 16.02.2025 సాయంత్రం 3 గంటలకు..

Also Read:   Cinema: ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ కిమ్ సేన్ రాన్ మృతి

Advertisment
తాజా కథనాలు