Operation Sindoor: పురాణాల్లో సింధూరం వెనుక ఉన్న రహస్యం ఇదే!!

పెళ్లైన స్త్రీలు భర్త ఆయుష్యుకు చిహ్నంగా సింధూరం ధరిస్తారు. పురాణాల్లో శివుడికి ఇష్టమని పార్వతీ, రాముడి కోసం సీత, హనుమంతుడు సింధూరాన్ని ధరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో భార్యల కళ్ల ముందే భర్త చంపి వారి నుదిట సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఆపరేషన్ సిందూర్.

New Update
Sindhoor history

భర్త ఆయుష్యుని భార్య నుదుటిన తిలకంలా దిద్దుకునే సంప్రదాయం హిందూవుల్లో ఉంది. దాన్నే సింధూరం అని పిలుచుకుంటాము. దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం తక్కువగానే కనిపించినా.. ఉత్తర భారతదేశంలో సింధూర్ అనే పదం ఫేమస్. 2025 మే6 తర్వాత ఇండియా మొత్తం ఈ పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు భార్యల కళ్లముందే వారి భర్తలను చంపేశారు. టెర్రరిస్టులు 26 మంది పర్యటకులను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ అనే ఎయిర్ స్ట్రైక్స్ చేసి దాదాపు 100 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో  భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాల్లో సింధూరం (నుదుట పాపిడలో బొట్టు) ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్త్రీ అక్కడ కుంకుమ బొట్టు పెట్టుకుందంటే వివాహిత అని అర్థం. సామాన్యంగా పెళ్లైన మహిళలు మాత్రమే సింధూరం ధరిస్తారు. వివాహ వేడుకలోనే భర్తతో నుదుట సింధూరం దిద్దిస్తారు. అప్పటి నుంచి ఆమె భర్త దీర్ఘాయువు కోసం ప్రతీరోజు సింధూరం ధరిస్తోంది.

Also Read :  IPL 2025: 10 ఓవర్లు కాదు 20.. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌పై బిగ్ అప్ డేట్!

Also Read :  ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

Operation Sindoor

పురాణాల ప్రకారం శివుని భార్య పార్వతీ దేవికి భర్త పట్ల భక్తిని చాటిచెప్పేందుకు ఈ నుదుటిపై సింధూరం ధరించేదని అంటారు. సింధూరం అంటే శివుడికి కూడా ఎంతో ఇష్టమట. నుదుటిపై సింధూరాన్ని ధరించే స్త్రీలు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారని పురాణాల ప్రకారం ఓ నమ్మకం. సింధూరం ధరించిన స్త్రీ జోలికి దుష్ట శక్తులు కూడా రావని చెబుతారు. సింధూరం రక్తం రంగులో ఉంటుంది. భారతీయ స్త్రీలు నుదుటిన బొట్టు పెట్టు కోవడం మహిళలను మరింత శక్తివంతురాలిగా చేస్తోందని పురాణాలు చెబుతున్నాయి.

Also Read :  ఇదేం ట్విస్ట్ మామా.. 7వ అడుగు వేస్తుండగా పెళ్లి రద్దు చేసుకున్న యువకుడు!

రామునిపై ఉన్న భక్తిని చాటిచెప్పేందుకు ఆంజనేయుడు ఏకంగా తన శరీరానికి మొత్తం సింధూరం పూసుకున్నాడు. హనుమంతుడు తన ఒంటికి సింధూరం పూసుకోవడం సీతమ్మను ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అని చెబుతారు. సింధూరం అనేది రాముడి భార్య సీతకు చాలా ఇష్టమని, ఆంజనేయ స్వామి తనను సీతమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఈ సింధూరాన్ని ధరించాడని రామాయణంలో చెబుతారు. సింధూరం ధరించడంతో ఆంజనేయ స్వామి, సీతారాములతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తున్నాడు. సింధూరం అనేది ఆంజనేయ స్వామికి ఒక గుర్తుగా, తన దాస్యభక్తికి ఒక ప్రతీకగా పరిగణించబడుతుంది.

Also Read :  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉగ్రవాది..!

(latest-telugu-news | Operation Sindoor Attack | Operation Sindoor 2.0 | baby named sindoor | indian army operation sindoor | india operation sindoor)

Advertisment
Advertisment
తాజా కథనాలు