/rtv/media/media_files/DT8zJeNViJiLkqzpP1tJ.jpg)
Rajasthan Wedding canceled due to ex-lover effect
Viral News: అంగరంగవైభవంగా జరుగుతున్న పెళ్లి అనూహ్యంగా ఆగిపోయింది. నెత్తిలో జీలకర్ర బెల్లం పెట్టి, మెడలో తాళి కట్టి, చిటికెనవేలు పట్టి నడుస్తుండగానే పెళ్లి కోడుకుకు ఊహించని షాక్ తగిలింది. ఆరుడుగులు పూర్తిచేసి ఏడోవ అడుగువేయబోతుండగా మోగిన ఫోన్ రింగ్ తన జీవితాన్నే తలకిందులు చేసింది. చివరి నిమిషంలో మాజీ ప్రియురాలు ఫోన్ చేయగానే ఏడో అడుగుఆపేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఏడడుగులు నడుస్తుండగా ఫోన్ కాల్..
రాజస్థాన్‌లో రెండు కుటుంబాల మధ్య పెళ్లి సంబంధం కుదిరింది. అయితే అప్పటికే మరో అమ్మాయిని ప్రేమించిన యువకుడు ఈ విషయాన్ని దాచి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతా ఘనంగా ఏర్పాట్లు చేసి పెళ్లి పందిట్లో వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్లు వేశాడు. ఈ క్రమంలోనే ఏడడుగులు నడుస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. అవతలనుంచి యువతి గోల చేసి ఏడుపు అందుకుంది. దీంతో ఆమె ప్రేమకు కరిగిపోయిన పెళ్లిపిలగాడు ఆరడుగుల పూర్తి చేసి ఏడో అడుగు వేయకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు.
Also Read: పాక్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి
దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. బంధువులు, స్నేహితులు అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వరుడు ఎంతకు ఒప్పుకోకపోవడంతో వధువు పేరెంట్స్ గొడవకు దిగారు. బంధువులను బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయితీని పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Also Read: అది చేయకుంటే కాల్పుల విరమణ ఆగిపోతుంది.. భారత్‌ను హెచ్చరించిన పాక్
marriage | cancel | rajastan | telugu-news | today telugu news