ప్రముఖ తెలుగు బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 8' ఎట్టకేలకు ముగుంపు దశకు చేరుకుంది. దాదాపు 100 రోజులకు పైగా ఆడియన్స్ ను అలరించిన ఈ షో నేటి సాయంత్రం గ్రాండ్ ఫినాలే ను జరుపుకోబోతోంది. ఎప్పటిలాగే ఈసారి ఫినాలే ఎపిసోడ్ కు సెలెబ్రిటీలతో పాటూ ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు.
తాజాగా అందుకు సంబంధించి ప్రోమో వదిలారు. అందులో ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించారు. హీరోయిన్ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్సులు ప్రోమోలో హైలైట్ గా నిలిచాయి. ఇక టాప్ 5లో ఉన్న నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ లపై నాగార్జున పంచులు వేసి నవ్వులు పూయించారు.
🌟 The #BiggBossTelugu8 Grand Finale is here! 🏆✨ Join Nagarjuna, contestants’ families, and special guests for an unforgettable night. Who will claim the ultimate victory? Don’t miss it—tonight at 7 PM on #StarMaa and @DisneyPlusHSTel https://t.co/Zz4Mx1mj1m
— Starmaa (@StarMaa) December 15, 2024
Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ఇక ఇదే ప్రోమోలో విన్నర్ ప్రైజ్ మనీ కూడా రివీల్ చేశారు. ఈ సీజన్ ప్రైజ్‌మనీ రూ.54,99,999 అని ప్రకటించిన నాగార్జున దానిని రూ.55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్‌తోపాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ ఐదు లక్షల వరకు పెంచడం విశేషం.
విన్నర్ అతనేనా?
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకరేమో నిఖిల్ విన్నర్ అంటూ చెబుతున్నారు. రన్నరప్‌లో గౌతమ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. ఇవాళ్టితో దానికి శుభం కార్డు పలకనున్నారు.
Also Read: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!