/rtv/media/media_files/2025/10/25/osama-bin-laden-escaped-disguised-as-a-woman-2025-10-25-17-01-00.jpg)
Osama bin Laden Escaped Disguised As A Woman
అమెరికాలో 2001, సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేపట్టిన ఉగ్రదాడి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడికి కీలక సూత్రధారి, ఆల్ ఖయిదా ఫౌండర్ అయిన ఒసామా బిన్ లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నట్లు మాజీ CIA అధికారి జాన్ కిరియాకౌ వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌లోని తోరా బోరా గుహల నుంచి అతడు పరారైనట్లు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. CIAలో ఆయన 15 ఏళ్ల పాటు సేవలందించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్విన్ టవర్స్‌పై దాడి జరిగిన తర్వాత అమెరికాకి చెందిన CIA పాకిస్థాన్‌లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు నిర్వహించింది.
Also Read: అదానీ కోసం 30 కోట్ల మంది LIC పాలసీదారుల సేవింగ్స్ దుర్వినియోగం: కాంగ్రెస్
ఈ దాడులకు కీలక సూత్రధారైన బిన్‌లాడెన్ కోసం వేట ప్రారంభించింది. అయితే ఈ దాడి జరిగిన నెల రోజుల తర్వాత బిన్‌లాడెన్ తోరాబోరా గుహల్లో ఉన్నట్లు గుర్తించామని జాన్ కిరియాకౌ తెలిపారు. సెంట్రల్ కమాండ్‌లో పనిచేస్తున్న ట్రాన్స్‌లేటర్ కూడా ఓ ఆల్ ఖయిదా అన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించామని పేర్కొన్నారు. ఆ గుహల నుంచి బయటకు రావాలంటూ బిన్‌లాడెన్‌కు వార్నింగ్ ఇచ్చామని.. కానీ వాళ్లు సాయంత్రం దాకా సమయం అడిగినట్లు చెప్పారు. మహిళలు, పిల్లలను బయటకు పంపడం కోసం టైం కావాలన్నారు. దీనికి తాము ఒకే చెప్పాలని ట్రాన్స్‌లేటర్ ఒప్పించాడని తెలిపారు.
Also Read: ఐక్యరాజ్యసమితిని తప్పుబట్టిన విదేశాంగ మంత్రి.. UNOపై విమర్శలు గుప్పించిన జైశంకర్
ఆ సమయంలో బిన్‌లాడెన్ మారువేషంలో ఆడ దుస్తులు ధరించి అక్కడి నుంచి చీకట్లో తప్పించుకున్నట్లు చెప్పారు. తెల్లవారేసరికి ఆ గుహల్లో ఎవరూ కనిపించలేదని.. వాళ్లందరూ కూడా పరారయ్యారని మాజీ సీఐఏ అధికారి చెప్పారు. అందుకే తమ ఆపరేషన్‌ను పాకిస్థాన్‌కు తరలించామని తెలిపారు. ఇదిలాఉండగా 2011 మే లో ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్‌లో ఉన్నట్లు CIA అధికారులు గుర్తించారు. చివరికి అమెరికా ప్రత్యేక దళాలు అతడిని అంతం చేశాయి.
Also Read: జమ్మూ-కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే..యూఎన్‌లో మరోసారి స్పష్టం
Follow Us