/rtv/media/media_files/2025/10/25/pak-2025-10-25-18-28-30.jpg)
Former CIA officer John Kiriakou claims Musharraf handed over control of Pakistan’s nuclear arsenal to the US
అమెరికా భారత్‌తో ఎంత స్నేహంగా ఉంటుందో.. పాకిస్థాన్‌తో కూడా అలాగే ఉంటోంది. ఇటీవల ట్రంప్ టారీఫ్‌ల వల్ల ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. కానీ పాకిస్థాన్‌తో మాత్రం అమెరికా తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ రెండు దేశాలకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ తమ అణ్వాయుధాల నియంత్రణను అమెరికాకు అప్పగించినట్లు మాజీ సీఐఏ అధికారి జాన్ కిరియాకౌ వెల్లడించారు. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఈ చర్యలకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు.
Also Read: ఐక్యరాజ్యసమితిని తప్పుబట్టిన విదేశాంగ మంత్రి.. UNOపై విమర్శలు గుప్పించిన జైశంకర్
అప్పట్లో అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు లక్షల డాలర్ల సాయం చేసిందని.. ఇలా డబ్బులిచ్చి ముషారఫ్‌ను వ్యూహాత్మకంగా కొన్నారని పేర్కొన్నారు. ఇలా పాక్ చేతిలోని అణ్వాయుధాలు అమెరికా నియంత్రణలోకి వెళ్లాయని తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ముషారఫ్ అమెరికా వైపు ఉన్నట్లు నటించారని.. కానీ రహస్యంగా భారత్‌లో దాడులు చేసేందుకు తీవ్రవాదులను ప్రేరేపించేవాడని తెలిపారు. అతడు ఉగ్రవాదనికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆరోపించారు. పాక్‌కు సైనిక సాయం లేదా ఆర్థిక అభివృద్ధి కోసం మిలియన్ల కొద్ది డాలర్లు ఇచ్చామని.. వారానికి చాలాసార్లు అతడితో సమావేశమయ్యేవాళ్లమని తెలిపారు. పాక్ భద్రత కార్యకలాపాల్లో అమెరికా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశం పొందినట్లు పేర్కొన్నారు.
#WATCH | On the question of fear of nuclear weapons falling into terrorists' hands in Pakistan, ex-CIA Officer, John Kiriakou says, "When I was stationed in Pakistan in 2002, I was told unofficially that the Pentagon controlled the Pakistani nuclear arsenal, and that Parvez… pic.twitter.com/iaKPpixhMZ
— ANI (@ANI) October 24, 2025
Also Read: ఒసామా బిన్ లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. వెలుగులోకి కీలక విషయాలు
అంతేకాదు సౌదీ అరేబియా అమెరికా ప్లాన్‌ను ప్రభావితం చేసినట్లు కూడా జాన్ కిరియాకో తెలిపారు. పాక్ శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్‌ను అమెరికా ఏజెన్సీలు టార్గెట్ చేయనుండగా అతడిని వదిలేయాలని సౌదీ తమను కోరినట్లు పేర్కొన్నారు. దీని వెనుక సౌదీ అరేబియా స్వప్రయోజనాలు, అణు ఆకాంక్షలు ఉన్నట్లు తెలిపారు. కానీ ఇదొక విధానపరమైన తప్పిదమని.. దక్షిణాసియా అణు వ్యూహాంపై ఇది ఎఫెక్ట్ చూపినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచ శక్తి సమతుల్యత మారుతున్నట్లు జాన్ కిరియాకో అన్నారు. ప్రస్తుతం చైనా, భారత్, సౌదీ అరేబియా దేశాలు తమ వ్యూహాత్మక పాత్రను మార్చుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అందుకోసమే అమెరికా కొత్త ఎత్తుగడలు వేయాల్సిన పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు దక్షిణాసియా రాజకీయలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోందని చెప్పారు. అయితే పాక్ అణ్వాయుధాలు అమెరికా కంట్రోల్‌లోకి వెళ్లాయనే విషయాన్ని ఆయన బయటపెట్టడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: జమ్మూ-కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే..యూఎన్‌లో మరోసారి స్పష్టం
Follow Us