/rtv/media/media_files/2025/10/25/mother-rock-daughter-shock-2025-10-25-18-23-47.jpg)
Mother Rock..Daughters Shock
Mother Rock..Daughters Shock : స్కూల్ లేదా కాలేజీకి వెళ్లే పిల్లలున్న ఇంట్లో రోజు ఉదయం ఒక యుద్ధమే. వారిని లేపడం అంటే ఓ యుద్ధం చేసినట్లే. ముఖ్యంగా పిల్లలు స్కూల్‌కి, కాలేజీకి, లేదా ఆఫీస్‌కి వెళ్లాల్సినప్పుడు ‘లేవమ్మా.. పొద్దు పొడిచింది!’ అన్న తల్లి మాటలకే.. కూతుళ్లు విసుక్కుంటారు. ఒక ఫైవ్ మినెట్స్ అంటూ అలాగే పడుకుండి పోతారు. అవసరమైతే ముసుగు తన్ని మరి పడుకుంటారు. కొంతమంది తల్లిని తిడుతూ భారంగా లేస్తారు. అయినా బద్ధకం వదిలిపెట్టరు. అయితే ఓ తల్లి మాత్రం నిద్రలేవని పిల్లల్ని చూసిచూడనట్టు అంత సులభంగా వదిలిపెట్టలేదు. కూతుళ్లు లేవకపోవడంతో ఏకంగా ‘బ్యాండ్’ను తెప్పించి వాయించి వారిని నిద్రలేపింది. ఇంటికి సన్నాయి బృందాన్ని పిలిపించి, కూతుళ్లను నిద్రలేపింది!
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ ఫన్నీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉదయం పొద్దెక్కుతోంది.. కానీ కూతుళ్లు ఇంకా చెద్దర్లు కప్పుకుని బెడ్‌లోనే ఉన్నారని ఈ తల్లికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. డోలు, ట్రంపెట్ ను పిలిపించింది. ఈ వీడియోలో ఇద్దరు సంగీతకారులు, ఒకరు డోల్‌తో మరియు మరొకరు ట్రంపెట్‌తో, ఇంట్లోకి వచ్చి "శ్రీ రామ్ జాంకీ బైతే హై" అనే భక్తి గీతాన్ని వినిపించారు. ఆ శబ్ధంతో క్షణాల్లో కూతుళ్లు ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచారు. ముఖాల్లో ఆశ్చర్యం, నవ్వు, చికాకుల కలయిక.. ‘ఏం జరుగుతోంది ఇక్కడ?’ అంటూ అరిచారు. ఆ ప్రశ్నకు తల్లి నవ్వుతూ, ‘ఇలా అయినా లేస్తారా ఇప్పుడు?’ అని ప్రశ్నించింది.
ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. దీంతో కామెంట్ల వర్షం మొదలైంది. ‘మదర్ ఆఫ్ ది ఇయర్!’ అంటూ తల్లిని ప్రశంసించగా, మరికొందరు ‘ఇలాంటివి చేయాలనే ధైర్యం ఉంటేనే పిల్లలు సరిగ్గా లేస్తారు!’ అని నవ్వేశారు. ఒకరు రాసిన కామెంట్ మరింత చమత్కారంగా ఉంది ‘మా ఇంట్లో అయితే సన్నాయి కాదు, డీజే పెట్టించాలి!’ అని. వీడియోలో కూతుళ్లు మొదట కోపంతో ఉన్నా, తర్వాత వాళ్లు కూడా నవ్వుతూ తల్లిని కౌగిలించుకున్నారు. అది ఒక్క క్షణం మాత్రమే అయినా, తల్లీ కూతుళ్ల మధ్య ఉన్న ఆ అల్లరి బంధం అందరికీ గుండెల్లో ముద్ర వేసింది.
అయితే ఈ ఘటన కేవలం హాస్య కోసమే కావచ్చు కానీ, ఒక సున్నితమైన సందేశం కూడా ఉంది.. తల్లి ప్రేమ ఎంత వెరైటీగా వ్యక్తం అవుతుందో ఈ వీడియో చూపించింది. కోపం కాదు.. బాధ కాదు, హాస్యం ద్వారా కూడా ప్రేమను వ్యక్తం చేయవచ్చు అని నిరూపించింది. ప్రతి తల్లి తన పిల్లలను నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది, కానీ ఈ అమ్మ మాత్రం ఆ క్షణాన్ని నవ్వులతో నింపింది అంటూ నెటిజన్లు స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో ఈ వీడియోకి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒక ప్రముఖ యూజర్ ‘ది ఈజ్ ద ప్యూర్ ఇండియన్ మామ్ ఎనర్జీ’ అంటూ రాశాడు. విదేశీ యూజర్లు కూడా స్పందిస్తూ, ‘ఇది మదర్ ఇన్ ఇండియా లెవెల్!’ అంటూ నవ్వుల వర్షం కురిపించారు.
Also Read : మహారాష్ట్ర మహిళా వైద్యురాలి ఆత్మహత్యలో రాజకీయ ఒత్తిడి? సూసైడ్ నోట్‌లో ఎంపీ పేరు..
Follow Us