Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ లో 200 మందికి పైగా ఉగ్రవాదులు మృతి..న్యూ అప్డేట్స్ అవుట్

పహల్గాందాడి తర్వాత పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో 200మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. కొంత మంది మిలటరీ సిబ్బంది కూడా ఉన్నారని చెబుతున్నారు. 

New Update
India

Operation Sindoor New Update

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొత్త అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ ఆపరేషన్ లో 200 మందికి పైగా మృతి చెందారని చెబుతున్నారు. చనిపోయిన వారిలో అత్యధికులు ఉగ్రవాదులే ఉన్నారని...కొంత మంది పాక్ సైనిక సిబ్బంది కూడా ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి రక్షణ వర్గాలు వివరాలు చెప్పినట్లు సమాచారం. 

170 మంది ఉగ్రవాదులు..

ఆపరేషన్ సింధూర్ పై భారత ఆర్మీ అధికారులు ఇంతకు ముందు కూడా వివరాలను చెప్పారు. అయితే అప్పుడు 170 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. తాజాగా మరోసారి దీనికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బహవల్‌పుర్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రముఠా ప్రధాన కేంద్రం తీవ్రంగా ధ్వంసమవ్వగా.. ఇక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ అధికారులు చెప్పారు. 

ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత  పాకిస్తాన్ కూడా దాడులు చేసింది. దాంతో పాక్ పని పట్టేందుకు భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పాక్‌ కీలక సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో 42 మంది మిలిటరీ సిబ్బంది మరణించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.  భారత్ ఆర్మీలో కూడా ఏడుగురు జవాన్లు మరణించారు.  సాధారణ పౌరులు 20 మంది చనిపోగా...మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

మహిళా పైలెట్లు..

ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అంతా మహిళా పైలెట్లదే అని ఆర్మీ అధికారులు తెలిపారు. అన్ని లక్ష్యాలను కచ్చితత్వంతో చేధించారని చెప్పారు. అత్యంత ముప్పుతో కూడిన ఈ ఆపరేషన్‌లో పలువురు మహిళా పైలట్లు ప్రత్యక్షంగా కీలక పాత్ర పోషించారు. యుద్ధ రంగంలో కూడా మహిళల పాత్ర పెరుగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ అయిపోలేదని...తాత్కాలికంగా ఆపామని అధికారులు వెల్లడించారు. మన దాడులతో పాక్ కు అవమానం జరిగింది. దానికి ప్రతిగా ఆ దేశం నుంచి దాడులు ఉంటాయని అంచనాలున్నాయి. అందుకే భారత్ హై అలెర్ట్ గా ఉందని రక్షణ అధికారులు తెలిపారు. 

today-latest-news-in-telugu | Indian Army | operation Sindoor | new-update

Also Read: MH:  డ్రగ్స్ ఇచ్చి వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన క్లాస్ మేట్స్

Advertisment
తాజా కథనాలు