/rtv/media/media_files/2025/10/26/bjp-mp-sanjay-jaiswal-receives-10-crore-extortion-threat-2025-10-26-17-47-42.jpg)
బీహార్‌లోని బీజేపీ సీనియర్ ఎంపీ సంజయ్ జైశ్వాల్(Sanjay Jaiswal) కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్(Blackmail Calls) రావడం కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే ఆ ఏంపీ కొడుకుని చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో సంజయ్ జైశ్వాల్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేసేందుకు యత్నిస్తున్నారు. దీని గురించి సబ్ డివిజినల్ పోలీస్ అధికారి (SDPO) వివేక్ దీప్ మీడియాకు వివరించారు.
Also Read: మొదటిసారిగా బాధిత కుటుంబాలతో విజయ్ సీక్రెట్ మీటింగ్.. ప్రైవేట్ రిసార్ట్‌లో 50 రూమ్స్ బుక్
BJP MP Sanjay Jaiswal Receives Blackmail Calls
'' శుక్రవారం మధ్యాహ్నం ఎంపీకి రెండుసార్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫోన్ కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తి రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే ఎంపీ కొడుకును చంపేస్తామని బెదిరించాడు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. కాల్ చేసిన నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని'' పేర్కొన్నారు.
Also Read: PM మోదీ కాన్వాయ్ భద్రతా లోపం.. రోడ్డు మీదే కార్లు వాటర్ వాషింగ్!
అయితే ఫోన్ కాల్ చేసి బెదిరించిన వ్యక్తికి క్రిమినల్స్‌తో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీని వెనుక రాజకీయ వైరం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. అన్ని కోణాల్లో ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంపీ జైశ్వాల్ లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్‌గా ఉన్నారు.
Follow Us