Maoists: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. లొంగిపోయిన 71 మంది మావోలు
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
Maoist Party : సాయుధ పోరాటాన్ని వదిలి ఆయుధాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలపై ఆ పార్టీ కేంద్రకమిటీ సీరియస్ అయింది. మల్లోజుల, ఆశన్న విప్లవద్రోహులుగా మారి శత్రువు ఎదుట లొంగిపోయారని అభయ్ ఆరోపించారు.
మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో అగ్రనాయకుడు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు ఈరోజు లొంగిపోయారు. కాగా రేపు మరికొంతమంది లొంగుబాటుకు సిద్ధమయ్యారు.
మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనతో పాటు చత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు.